Viral Video: వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా.. చల్లటి గాలి కోసం గాడిదను ఎలా వాడుకున్నారో చూడండి..
ABN , Publish Date - Feb 07 , 2024 | 04:49 PM
ఇన్నాళ్లూ చలితో ఇబ్బంది పడ్డ ప్రజలు.. ఇప్పుడిప్పుడే ఎండ వేడిని ఎదుర్కొంటున్నారు. ఇక రోజులు గడిచే కొద్దీ అంతా వేసవి ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇదిలావుండగా..
ఇన్నాళ్లూ చలితో ఇబ్బంది పడ్డ ప్రజలు.. ఇప్పుడిప్పుడే ఎండ వేడిని ఎదుర్కొంటున్నారు. ఇక రోజులు గడిచే కొద్దీ అంతా వేసవి ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇదిలావుండగా.. ఇప్పటి నుంచే కొందరు తమ ఇళ్లలో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసుకోవడం, ఉన్న వాటికి మరమ్మతులు చేయించడం చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కుటుంబం చల్లటి గాలి కోసం ఫ్యాన్లు, కూలర్లు కాకుండా గాడిదను తెచ్చుకున్నారు. దాని సాయంతో ఫ్యాన్ తరహాలో గాలి వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసి వారంతా.. ‘‘గాడిదను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లో (Pakistan) ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు ఓ కుటుంబం వినూత్న ప్రయోగం చేసింది. ఫ్యాన్లు, కూలర్లకు ధర వెచ్చించడం దండగ అనుకున్నారో ఏమో గానీ.. విచిత్రంగా గాడిదను (Donkey) తీసుకొచ్చారు. అంతా ఆరుబయట మంచాలు వేసుకుని పడుకున్నారు. వాటి మధ్యలో పెద్ద కర్రలు ఏర్పాటు చేసి, వాటిపై పొడవాటి కర్రను ఉంచారు. దానికి రెండు చివరల్లో గుడ్డ ముక్కలను కట్టారు. ఆ పొడవాటి కర్ర గుండ్రంగా తిరిగేలా ఏర్పాట్లు చేశారు.
Optical illusion: ఇక్కడున్న పైనాపిల్స్‌లో ఒకటి విభిన్నంగా ఉంది.. అదేంటో 10 సెకన్లలో కనుక్కోగలరా.. ?
పాత కాలంలో ఎద్దులతో గానుగ ఆడించే తరహాలో ఏర్పాటు చేశారన్నమాట. ఇలా గాడిద చుట్టూ తిరుగుతుండడంతో వారందరికీ ఫ్యాన్ తరహాలో గాలి తగులుతోంది. పాకిస్థాన్‌లోని చాలా క్రమాల్లో కరెంట్ సక్రమంగా ఉండడం లేదని తెలిసింది. దీంతో చాలా మంది పేదలు ఇలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో’’.. అంటూ మరికొందరు, ‘‘జంతువులను హింసించడం నేరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 87వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Wedding Video: వధువు ముందే వరుడి స్నేహితుడి తుంటరి చేష్టలు.. బాబోయ్..! ఇలాక్కూడా గిఫ్ట్‌లు ఇస్తారా..