Viral: ఊపిరాడక ఆస్పత్రికి వెళ్లిన రోగి.. స్కానింగ్ తీయగా.. ఊపిరితిత్తుల్లో షాకింగ్ సీన్.. చివరకు..
ABN , Publish Date - Mar 01 , 2024 | 05:59 PM
సాధారణ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అసాధారణ సమస్యలు వెలుగుచడడం తరచూ చూస్తుంటాం. కొందరు చెవి నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. వైద్యులు చివరకు వారి చెవి నుంచి పాములను బయటకు తీయడం చూశాం. అలాగే ముక్కు నుంచి రక్తం కారుతోందని ఆస్పత్రికి వెళ్తే.. చివరకు..
సాధారణ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అసాధారణ సమస్యలు వెలుగుచడడం తరచూ చూస్తుంటాం. కొందరు చెవి నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. వైద్యులు చివరకు వారి చెవి నుంచి పాములను బయటకు తీయడం చూశాం. అలాగే ముక్కు నుంచి రక్తం కారుతోందని ఆస్పత్రికి వెళ్తే.. చివరకు వైద్యులు లోపలి నుంచి లైవ్ బగ్స్‌ను తొలగించడం చూశాం. అలాగే కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన రోగి శరీరం నుంచి ఇనుప వస్తువులను బయటకు తీయడం కూడా చూశాం. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఊపిరాడక ఆస్పత్రికి వెళ్లిన రోగికి వైద్యులు స్కానింగ్ తీశారు. చివరకు ఊపిరితిత్తుల్లో వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది.
కేరళలోని (Kerala) కొచ్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి కొన్ని నెలలుగా శ్వాసకోశ సమస్యతో (breathing issues) ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల సమస్య తీవ్రమవడంతో చివరకు స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. రోగిని పరీక్షించిన వైద్యులు.. చివరకు అతడికి స్కానింగ్ తీశారు. అందులో ఊపిరితిత్తులో ఏదో పురుగు ఇరుక్కున్నట్లు చూసి షాక్అయ్యారు. చివరకు ఆపరేషన్ చేసి చూడగా.. ఊపిరితిత్తుల్లో బొద్దింక (cockroach) ఉండడం చూసి వారంతా ఖంగుతిన్నారు. సదరు రోగికి గతంలో మెడకు చికిత్స జరిగిందని తెలిసింది.
Viral Video: ఇతడి టాలెంట్‌కి ఫిదా అయిన ప్రొఫెసర్.. ఇలా సర్‌ప్రైజ్ చేయాలని.. ఎలా అనిపించిందయ్యా..!
ఆ సమయంలో వైద్యులు అతడి మెడకు ట్యూబ్ అమర్చారు. ఆ పైపు గుండా బొద్దింక కడుపులోకి ప్రవేశించి ఉండొచ్చని వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. ఎట్టకేలకు విజయవంతంగా ఆపరేషన్ చేసి, బొద్దింకను బయటికి తీశారు. రోగి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఊపిరితిత్తుల్లో బొద్దింకనా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి కేసు గురించి ఎప్పుడూ వినలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.