Anant Radhika Wedding: అంబానీ కుటుంబ పెళ్లి వేడుక మామూలుగా లేదుగా.. స్టార్ క్రికెటర్లు ఎవరెవరు వచ్చారంటే.. | Indian star cricketers Sanchin Tendulkar MS Dhoni and others was attended by Reliance Chairman Mukesh Ambani son Anant Ambani wedding ceremony Videos viral kjr spl
Share News

Anant Radhika Wedding: అంబానీ కుటుంబ పెళ్లి వేడుక మామూలుగా లేదుగా.. స్టార్ క్రికెటర్లు ఎవరెవరు వచ్చారంటే..

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:49 PM

రిలయన్స్ అధినేత‌ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె రాధిక పెళ్లి అంగరంగవైభవంగా జరుగుతోంది. అసలే కుబేరులు కావడంతో వారి పెళ్లి ఏర్పాట్లు ఎల ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ కుటుంబం పెళ్లి గురించే చర్చ జరుగుతోంది.

Anant Radhika Wedding: అంబానీ కుటుంబ పెళ్లి వేడుక మామూలుగా లేదుగా.. స్టార్ క్రికెటర్లు ఎవరెవరు వచ్చారంటే..

రిలయన్స్ అధినేత‌ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె రాధిక పెళ్లి అంగరంగవైభవంగా జరుగుతోంది. అసలే కుబేరులు కావడంతో వారి పెళ్లి ఏర్పాట్లు ఎల ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ కుటుంబం పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. మార్చి 1, 2, 3 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. అలాగే పలువురు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు కూడా తరలివస్తున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు సతీసమేతంగా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral videos) నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.

గుజరాత్‌లోని జాంనగర్‌లో ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ వేడకకు హాజరైన టీమిండియా క్రికెటర్ల వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. భార‌త స్టార్ ప్లేయ‌ర్లు (Indian star cricket players) స‌చిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, జహీర్ ఖాన్, అతని భార్య సాగరిక ఘట్గే, సూర్యకుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ముంబై విమానాశ్రయంలో వీరు తలుక్కున మెరిశారు. అలాగే ఈ వేడుకకు హాజరయ్యే వీవీఐపీల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిస్సిల్లా చాన్, ప్రఖ్యాత బార్బాడియన్ గాయని రిహన్న, మల్టీ-ఇన్‌స్ట్రుమెంటలిస్ట్ ఆడమ్ బ్లాక్‌స్టోన్, బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్,రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, రాణి ముఖర్జీ తదితరులు ఉన్నారు.

Viral: ఆ ఇద్దరు నర్సులకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..! రోడ్డు పక్కన జనం మధ్యలో 33 ఏళ్ల మహిళ ఉన్నట్టుండి..

మరోవైపు సౌదీ అరేబియా (Saudi Arabia) కంపెనీ అరమ్‌కో చైర్‌పర్సన్ యాసిర్ అల్ రుమయ్యన్, ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, భూటాన్ (Bhutan) రాణి జెట్సన్ పెమా కూడా ఆహ్వానాలు అందుకున్నారు. ఈ వివాహానికి ముందు జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ అనే గ్రామంలో సాంప్రదాయ ‘‘అన్న సేవ’’ పేరుతో సుమారు 51,000 మంది గ్రామస్తులకు గుజరాతీ వంటకాలను (Gujarati Cuisines).. అంబానీ కుటుంబం స్వయంగా వడ్డించింది. కాగా, ప్రస్తుతం వివాహానికి హాజరైన ప్రముఖులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.

Viral Video: ఇతడి టాలెంట్‌కి ఫిదా అయిన ప్రొఫెసర్‌.. ఇలా సర్‌ప్రైజ్ చేయాలని.. ఎలా అనిపించిందయ్యా..!

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Mar 01 , 2024 | 05:50 PM