Viral Video: వామ్మో.. ఇదేంటమ్మా.. ! రాత్రి వేళ వేగంగా వెళ్తున్న రైలు వద్ద.. ఈమె నిర్వాకం చూస్తే.. | woman dancing at night in front of speeding train video is going viral kjr spl
Share News

Viral Video: వామ్మో.. ఇదేంటమ్మా.. ! రాత్రి వేళ వేగంగా వెళ్తున్న రైలు వద్ద.. ఈమె నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:26 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో లైక్‌లు, వ్యూస్‌ను చూసి మనిషి హోదాను అంచనా వేసే పరిస్థితి నెలకొంది. వ్యూస్ వస్తే ఎగిరిగంతులేయడం, రాకపోతే నిరాశలో కూరుకుపోవడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో ఏదోటి చేసి మంది లైక్స్, వ్యూస్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఏవేవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ...

Viral Video: వామ్మో.. ఇదేంటమ్మా.. ! రాత్రి వేళ వేగంగా వెళ్తున్న రైలు వద్ద.. ఈమె నిర్వాకం చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో లైక్‌లు, వ్యూస్‌ను చూసి మనిషి హోదాను అంచనా వేసే పరిస్థితి నెలకొంది. వ్యూస్ వస్తే ఎగిరిగంతులేయడం, రాకపోతే నిరాశలో కూరుకుపోవడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో ఏదోటి చేసి మంది లైక్స్, వ్యూస్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఏవేవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో చాలా మంది ప్రమాదాల బారిన పడడం కూడా చూస్తుంటాం. ఈ తరహా వీడియోలు తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ మహిళ వేగంగా వెళ్తున్న రైలు వద్దకు వెళ్లి ప్రమాదకర స్థితిలో డాన్స్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. లైక్‌లు, వ్యూస్ కోసం ఏదైనా కొత్తగా చేయాలని అనుకుందో ఏమో గానీ.. ఓ మహిళ వినూత్నంగా డాన్స్ చేసి అంతా అవాక్కయ్యేలా చేసింది. ఇందుకోసం ఆమె (woman dance at moving train) కదులుతున్న రైలును ఎంచుకుంది. రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు కదులుతున్న సమయంలో బోగి తలుపుల వద్ద నిలబడి ఉన్న ప్రయాణికుల వద్దకు వెళ్లి భోజ్‌పురి పాటకు డాన్స్ వేయడం మొదలెట్టింది. ప్రయాణికుల చేయి పట్టుకుని మరీ చిత్రవిచిత్రంగా డాన్స్ చేసింది.

Viral Video: సినిమాకి మించిన ట్విస్ట్.. ప్రియురాలితో షాపింగ్‌కి వెళ్తే.. ఇలా జరిగిందేంటీ..

అంతటితో ఆగకుండా రాత్రి సమయంలో వేగంగా వెళ్తున్న రైలు పక్కగా నిలబడి అసభ్యకర రీతిలో డాన్స్‌లు చేస్తూ అందరినీ పలకరిస్తూ ఉంది. ఈ క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలకే ముప్పు వాటిళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఆమె మాత్రం ఏమాత్రం లెక్కచేయకుండా ఇలా ప్రమాదకర స్థితిలో డాన్స్ వేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రీల్స్ పిచ్చి పీక్స్‌కు వెళ్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి డాన్స్‌లు చేయడం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 44వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆఫ్రికన్ రోగికి చికిత్స చేసిన ఇండియన్ నర్సు.. సీక్రెట్‌గా వీడియో తీస్తూ.. చివరకు అతను ఏమన్నాడంటే..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Feb 29 , 2024 | 05:27 PM