Viral Video: ఈ యువతి ఐడియా అదుర్స్..! పేరుకుపోయిన మంచు గడ్డలతో నోరూరించే రెసిపీ..
ABN , Publish Date - Feb 21 , 2024 | 06:08 PM
మంచు కురిసే ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూపరులను ఎంతలా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది అలాంటి ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు క్యూకడుతుంటారు. మంచు గడ్డలపై...
మంచు కురిసే ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూపరులను ఎంతలా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది అలాంటి ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు క్యూకడుతుంటారు. మంచు గడ్డలపై సంతోషంతో గెంతులేస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంటారు. అయితే అదే మంచుతో మంచి రెసిపీ చేయొచ్చని చాలా మందికి తెలీదు. హిమాచల్ ప్రదేశ్ యువతికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి మంచు గడ్డలను ఇంటికి తీసుకొచ్చి.. చివరకు మంచి రెసిపీ సిద్ధం చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వావ్! ఈ యువతి ఐడియా అదుర్స్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్‌కు (Himachal Pradesh) చెందిన ఓ యువతి మంచు గడ్డలతో మంచి రెసిపీని సిద్ధం చేసింది. బయట గుట్టలుగా పేరుకుపోయిన మంచులో కొద్ది భాగాన్ని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకెళ్లింది. ముందుగా మంచు గడ్డను (ice cube) ఓ పెద్ద ప్లేటులోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసింది. తర్వాత దానిపై కొత్తిమీర పేస్ట్, పసుపు (Coriander paste, turmeric) తదితర అనేక రకాలను జోడించింది.
చివరగా దానిపై పంచదార మిక్స్ చేసి ఫైనల్‌గా నోరూరించే ఆహారాన్ని సిద్ధం చేసింది. మంచు అనగానే ఆటలు ఆడుకోవడం, ఫొటోలు తీసుకోవడమే కాదు.. ఇలాక్కూడా ఉపయోగించుకోవచ్చు అంటూ ఈ రెసిపీని ఎలా చేయాలో వివరిస్తూ వీడియో చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్!.. ఐస్ గడ్డలతో ఇలాక్కూడా చేయొచ్చా.. సూపర్’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటేనే నోరూరుతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొదంరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 77వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.