Share News

Viral: వీల్‌చైర్‌లో వృద్ధుడి శవాన్ని బ్యాంకులోకి తీసుకొచ్చిన మహిళ.. తరువాత ఏం చేసిందో తెలిస్తే..

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:42 PM

వృద్ధుడి శవాన్ని బ్యాంకులోకి తీసుకొచ్చిన ఓ బ్రెజిల్ మహిళ, ఆయన బతికే ఉన్నాడంటూ వృద్ధుడి పేరిట లోన్ తీసుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది.

Viral: వీల్‌చైర్‌లో వృద్ధుడి శవాన్ని బ్యాంకులోకి తీసుకొచ్చిన మహిళ.. తరువాత ఏం చేసిందో తెలిస్తే..
woman with dead man in wheelchair in brazil bank

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకులను బురిడీ కొట్టించే కేటుగాళ్లు ఎందరో ఉన్నారు. లోన్లు తీసుకుని కట్టలేమంటూ చేతులెత్తేసేవారు మరికొందరు. కానీ వీరందరికంటే భిన్నమైన పంథా అనుసరించిందో మహిళ. శవం సాయంతో భారీ ప్లాన్ వేసిన ఆమె చివరకు అడ్డంగా బుక్కైపోయింది. బ్రెజిల్‌లో (Brazil) వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: చైనా రైల్వే స్టేషన్ డిజైన్ చూసి షాక్‌లో నెటిజన్లు!


స్థానిక మీడియా కథనాల ప్రకారం, రియో నగరానికి (Rio De jenerio) పశ్చిమాన ఉన్న రియోడిజెనీరో బ్యాంకుకు నిందితురాలు ఓ శవాన్ని కుర్చిలో కూర్చోపెట్టి తీసుకొచ్చింది. కుర్చీలో ఉన్నది తన 68 ఏళ్ల మేనమామ అని, ఆయన పేరిట లోన్ ఇవ్వాలని అడిగింది. అతడు అచేతనంగా ఉన్నప్పటికీ బ్యాంకు వారికి డౌట్ రాకుండా నాటకం మొదలెట్టింది. లోన్ దరఖాస్తులపై శవం చేయిపట్టి సంతకం చేయిస్తున్నట్టు నటించింది. కానీ అప్పటికే అధికారులకు డౌట్ రావడంతో అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి.. వృద్ధుడు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. (woman Tried To Take Out Bank Loan For Man In Wheelchair it Was a Body).

ఈ క్రమంలో పోలీసులు ఆ మహిళపై బ్యాంకు మోసం, శవాన్ని అగౌరవపరచడం తదితర నేరాలు మోపి కేసు నమోదు చేశారు. ఆమె మొత్తం 3250 డాలర్ల లోన్‌ కోసం ప్రయత్నించిందని మీడియా పోలీసులు చెప్పారు. ‘‘ఆమె శవం చేయిపట్టుకుని సంతకం చేయిస్తూ అతడు బతికే ఉన్నట్టు మోసం చేసే ప్రయత్నం చేసింది. కానీ బ్యాంకులోకి వచ్చేటప్పటికే అతడు మృతి చెందాడు’’ అని దర్యాప్తు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, మహిళ తరపు లాయర్లు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 03:49 PM