Viral: తోటి ప్రయాణికుడి స్వీట్ సర్‌ప్రైజ్‌కు కన్నీళ్లు ఆపుకోలేకపోయిన యువతి.. మనసుకు హత్తుకునే అద్భుత దృశ్యం!
ABN , Publish Date - Apr 16 , 2024 | 05:22 PM
తోటి ప్రయాణికుడు ఇచ్చిన స్వీట్ సర్‌ప్రైజ్‌కు కన్నీటిపర్యంతమైన ఓ యువతి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. యువకుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: తోటి ప్రయాణికుడు ఇచ్చిన స్వీట్ సర్‌ప్రైజ్‌కు కన్నీటిపర్యంతమైన ఓ యువతి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. యువకుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మంచి మనసులు అంటే ఇవే అంటూ జనాలు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ నెటిజన్లకు మాత్రం ఈ వీడియో తెగ నచ్చేసింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువతి మెట్రోలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె తన మానాన తాను సీటులో కూర్చుని బర్గర్ తింటోంది. ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆమె పక్కను కూర్చున్నాడు. ఊడిపోయిన తన షూ లేసు కట్టుకోవాలంటే చేతిలోని పూల బుకేను ఆమెకిచ్చి కాసేపు పట్టుకోమన్నాడు. ఆమె ఓకే చెప్పింది. అతడు షూ లేసు కట్టుకున్నాక తనకు బర్గర్ పెట్టమన్నాడు. ఆమె అందుకు కూడా సరేనని తన చేతిలోని బర్గర్ ఇస్తే అతడు ఓ ముక్క కొరికి తిన్నాడు.
Anand Mahindra: మనం కూడా దీన్ని అభివృద్ధి చేయాలి.. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థపై ఆనంద్ మహీంద్రా
ఆ తరువాత బోకే ఆమె వద్దనే పెట్టిన అతడు ఓ చిన్న చిట్టీ కూడా ఇచ్చి వెళ్లిపోయాడు. అమె పిలుస్తున్నా వెనక్క తిరిగి రాలేదు. చిట్టీలో ఉన్నది చదవి ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయింది. చివరకు ఆనందం తట్టుకోలేక కన్నీటిపర్యంతమైంది. సున్నిత మనస్కురాలు కావడంతో యువతి.. అతడి మంచితనం చూసి ఇట్టే కరిగిపోయింది. ఇది చూసిన యువకుడు మళ్లీ ఆమె వద్దకు వచ్చి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని వెళ్లిపోయాడు (Woman Priceless Reaction After Receiving Roses From Stranger).
ఇదంతా చూసిన నెటినన్లు యువతి నిష్కల్మషమైన మనసు చూసి హర్షం వ్యక్తం చేశారు. లోకంలో డబ్బున్న వాళ్లు, శక్తిమంతులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా ఇలాంటి వాళ్లవల్లే మానవత్వంపై తమకు నమ్మకం ఇంకా పోలేదని కొందరు కామెంట్ చేశారు. మంచివారికి లోకమంతా మంచిగానే కనిపిస్తుందని, అందుకే వారిని కొందరు అమాయకులుగా పొరబబుతుంటారని కూడా కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి