Viral Video: కనీసం సీటు బెల్టూ పెట్టుకోరా.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. వీడియో వైరల్..
ABN , Publish Date - Apr 01 , 2024 | 02:21 PM
బీచ్ లో గడపడం చాలా మందికి సరదా. ఇష్టమైన వారితో కలిసి నడిస్తుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇక సముద్ర తీరంలో బైక్ రైడింగ్ చేస్తే ఎలా ఉంటుంది. ఇక కారులో రయ్యిమంటూ దూసుకుపోతుంటే ఆ అనుభూతి ఊహకే అందదు.
బీచ్ లో గడపడం చాలా మందికి సరదా. ఇష్టమైన వారితో కలిసి నడిస్తుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇక సముద్ర తీరంలో బైక్ రైడింగ్ చేస్తే ఎలా ఉంటుంది. ఇక కారులో రయ్యిమంటూ దూసుకుపోతుంటే ఆ అనుభూతి ఊహకే అందదు. కానీ సరదా మాటున ప్రమాదం కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. జాగ్రత్తగా ఉంటూ జ్ఞాపకాలను దాచుకోవాలి. అంతే గానీ ఇష్టమొచ్చినట్లు చేస్తూ ప్రమాదాలకు గురి కావద్దు. సముద్ర తీరంలో ఘోర ప్రమాదానికి గురైన కారుకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ ( Viral ) గా మారింది. కారు అదుపుతప్పి గాల్లో లేచి పల్టీలు కొట్టడంతో డ్రైవర్ కారు నుంచి బయటకు వచ్చి గాల్లో పల్టీలు కొట్టడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది.
Jai Shankar: కచ్చతీవు రగడ.. జై శంకర్ స్పందన ఇదే..
కువైట్ లోని ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ పరిధిలోని సముద్ర తీరంలో ఓ కారు చక్కర్లు కొడుతోంది. అలా కొంత దూరం వచ్చాక కారు స్పీడ్ పెరిగింది. అలల తీవ్రత కూడా పెరగడంతో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పింది. అంతటితో ఆగకుండా గాల్లోకి పల్టీలు కొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు నడుపుతున్న డ్రైవర్ వాహనం నుంచి బయటకు వచ్చి మరీ గాల్లో పల్టీలు కొట్టడం గమనార్హం.
India - China: అరుణాచల్ ప్రదేశ్ వారిదేనట.. తీరు మార్చుకోని డ్రాగన్..
అయితే అదృష్టవశాత్తు కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సముద్ర తీరంలో కారు బోల్తా పడినట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కనీసం సీటు బెల్టు కూడా పెట్టుకోలేదని డ్రైవర్ తీరుపై మండిపడుతున్నారు.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.