Viral Video: ఆడుకోవాలంటే ఖాళీ స్థలమే కావాలా.. వీళ్ల ఫుట్‌బాల్ గేమ్ చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Feb 07 , 2024 | 06:00 PM
కొందరు యువకులు.. కాస్త ఖాళీ స్థలం దొరికితే చాలు.. వివిధ రకాల ఆటలు ఆడుతుంటారు. అయితే ఈ వెసులుబాటు పల్లెలతో పోల్చుకుంటే పట్టణాలు, నగరాల్లో చాలా తక్కువగా ఉంటుంది. క్రీడల కోసం...
కొందరు యువకులు.. కాస్త ఖాళీ స్థలం దొరికితే చాలు.. వివిధ రకాల ఆటలు ఆడుతుంటారు. అయితే ఈ వెసులుబాటు పల్లెలతో పోల్చుకుంటే పట్టణాలు, నగరాల్లో చాలా తక్కువగా ఉంటుంది. క్రీడల కోసం కేటాయించిన ప్లే గ్రౌండ్లలో మాత్రమే ఆటలు ఆడుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ముగ్గురు యువకులు ఇళ్లపై నుంచి ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా... ‘‘వామ్మో! ఇలాంటి ఫుట్‌బాల్ గేమ్ ఎక్కడా చూల్లేదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. ముగ్గురు యువకులు ఫుట్‌బాల్ గేమ్ (football game) ఆడాలని అనుకున్నారు. అయితే అది పట్టణం కావడంతో ప్లేగ్రౌండ్ సమీపంలో లేదు. అయినా వారు మాత్రం గేమ్ ఆడాలని అనుకున్నారు. ఎవరి ఇళ్లలో వారు ఉంటూనే ఫుట్‌బాల్ ఆడాలని డిసైడ్ అయ్యారు. వారి వారి ఇళ్ల టెర్రస్ మీదకు వెళ్లారు. ముందుగా వారిలో ఓ వ్యక్తి బంతిని కాలితో.. .. దూరంగా మరో ఇంటిపై ఉన్న స్నేహితుడికి పాస్ చేశాడు. అతను కూడా ఎంతో చాకచక్యంగా బంతిని తన ఛాతీపైకి తీసుకుని అటూ ఇటూ ఆడించి.. తర్వాత అతడికి దూరంగా మరో ఇంటిపై ఉన్న మూడో వ్యక్తికి పాస్ చేస్తాడు.
Viral Video: వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా.. చల్లటి గాలి కోసం గాడిదను ఎలా వాడుకున్నారో చూడండి..
అతను కూడా బంతి కిందపడకుండా బ్యాలెన్స్ చేసి, మళ్లీ మొదటి వ్యక్తికి పాస్ చేస్తాడు. ఇలా వారు ముగ్గురూ దూరంగా ఉన్నా కూడా.. ఫుట్‌బాల్ గేమ్‌ను ఆడటం చూసి చుట్టు పక్కల ఉన్న వారంతా షాక్ అయ్యారు. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఫుట్‌బాల్ గేమ్.. ఇలాక్కూడా ఆడొచ్చా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 67వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Wedding Video: వధువు ముందే వరుడి స్నేహితుడి తుంటరి చేష్టలు.. బాబోయ్..! ఇలాక్కూడా గిఫ్ట్‌లు ఇస్తారా..