Optical illusion: షార్ప్ బ్రెయిన్ ఉన్న వారు మాత్రమే.. వీరిలో దొంగను 15 సెకన్లలో గుర్తించగలరు..
ABN , Publish Date - Dec 01 , 2024 | 08:56 AM
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ మహిళ, ఓ యువతి, బాలుడు, మరో వ్యక్తి ఓ దుకాణంలో ఉండడాన్ని చూడొచ్చు. అయితే వీరిలో ఒకరు దొంగతనం చేశారు. ఆ దొంగను 15 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, కష్టతరమైన పజిల్స్‌ను పరిష్కరించేందుకు ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరుగుతంది. అలాగే మెదడు కూడా షార్ప్‌గా మారి, మరింత చురుగ్గా పని చేస్తుంది. ఇందుకోసం సోషల్ మీడియాలో అనేక ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో కొన్ని చిత్రాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం మీ కోసం ఇలాంటి ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న వారిలో దొంగ ఎవరో గుర్తు పట్టారంటే మీ బ్రెయిన్ ఎంతో షార్ప్‌గా పని చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ మహిళ, ఓ యువతి, బాలుడు, మరో వ్యక్తి ఓ దుకాణంలో ఉండడాన్ని చూడొచ్చు. వారిలో ఓ మహిళ అక్కడున్న దుస్తులను పరిశీలిస్తుండగా.. మరో యువతి అక్కడే నిలబడి ఏదో గమనిస్తూ ఉంటుంది. అలాగే వారి మధ్యలో ఓ పిల్లాడు కూడా ఉంటాడు.
కాగా, ఈ ముగ్గురి పక్కనే ఉన్న మరో వ్యక్తి కళ్లద్దాలు పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే మీ కళ్లకు ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఈ నలుగురిలో ఒకరు దొంగతనం చేశారు. కానీ అంతా పద్ధతిగా ఉన్నట్లే కనిపిస్తున్నారు. కాస్త నిశితంగా పరిశీలిస్తే ఆ దొంగ (thief) ఎవరో ఇట్టే తెలిసిపోతుంది.
మీ కళ్లతో పాటూ మనసును కూడా ఈ చిత్రంలో కేంద్రీకరిస్తే ఆ దొంగను పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. చాలా మంది ఆ దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పది మందిలో కేవలం ఇద్దరు మాత్రమే పసిగట్టగలుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ దొంగ ఎవరో గుర్తుపట్టేందుకు మీరూ ప్రయత్నించండి.
ఎంత ప్రయత్నించినా ఆ దొంగను గుర్తించడం మీ వల్ల కాకపోతే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఈ నలుగురిలో అద్దంలో చూసుకుంటున్న వ్యక్తే ఆ దొంగ. అతడు వేసుకున్న షర్ట్‌కు ట్యాగ్ ఉండడాన్ని చూడొచ్చు. ఈ దొంగను ముందే పసిగట్టిన వారంతా షార్ప్ బ్రెయిన్ ఉన్న వారని తేలిపోయింది.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..