Optical illusion: ఈ రెండు చిత్రాల్లోని 5 తేడాలను గుర్తించడం మీకు సాధ్యమేనా..
ABN , Publish Date - Jun 06 , 2024 | 05:11 PM
సోషల్ మీడియాలో ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని పజిల్స్‌ను పరిష్కరించడం చాలా కష్టంగా ఉంటుంది. మరికొన్నింటిని పరిష్కరించడం ఎంతో సులభంగా ఉంటుంది. అయితే...
సోషల్ మీడియాలో ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని పజిల్స్‌ను పరిష్కరించడం చాలా కష్టంగా ఉంటుంది. మరికొన్నింటిని పరిష్కరించడం ఎంతో సులభంగా ఉంటుంది. అయితే ఎలాంటి ఫొటోలు అయినా నెటిజన్లను మాత్రం ఇట్టే ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం తాజాగా మీ ముందుకు ఇలాంటి ఓ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 5 తేడాలు ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు ప్రయత్నించడం మరి.
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు చిత్రాల్లో ఓ విచిత్ర ఆకారంలో ఉన్న జంతువుల నిలబడి ఉంది. దాని తలపై ఆపిల్ పండు తదితరాలు ఉన్నాయి. అలాగే అటు పక్కనే ఓ చెట్టు కూడా ఉంది. వాటి వెనుక ఆకాశంలో మేఘాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆ జంతువు నిలబడ్డ ప్రాంతంలో నేలపై కొన్ని పూలు కూడా పడి ఉన్నాయి.
Viral Video: ఈమేంటీ.. చూసేందుకు సున్నితంగా ఉన్నా.. ఎదురుగా చికెన్ పెట్టగానే..
ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే మీకు ఓ పరీక్ష పెడుతున్నాం. చూసేందుకు ఈ రెండు చిత్రాలు ఒకేలా ఉన్నాయి. వాటిలో ఎలాంటి తేడాలూ లేనట్లు అనిపిస్తుంది. కానీ ఈ రెండు చిత్రాల్లో మొత్తం 5 తేడాలు (5 differences) ఉన్నాయి. అయితే వాటిని గుర్తించడం ఎంతో సులభం అనుకుంటే పొరపాటే. ఎంతో తీక్షణంగా పరిశీలిస్తే తప్ప ఆ తేడాలను కనిపెట్టడం సాధ్యం కాదు.
Viral Video: ఆస్పత్రి వార్డులోకి దూసుకెళ్లిన ఏనుగు.. కారణం తెలిస్తే.. గుండె తరుక్కుపోతుంది..
చాలా మంది ఈ తేడాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే వాటిని గుర్తించగలుగుతున్నారు. ఇందకెందుకు ఆలస్యం.. ఆ తేడాలను పసిగట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Viral Video: సింహాల మధ్యలోకి రాయల్‌గా ఎంట్రీ ఇచ్చాడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..