Viral Video: ఈమేంటీ భర్తతో కలిసి మరీ ఇలా చేసిందీ.. చెత్త కుండీల వద్దకు కుక్క పిల్లలను తీసుకొచ్చి..
ABN , Publish Date - Jun 05 , 2024 | 08:20 PM
కొందరు సాటి మనుషులపై ఎంత ప్రేమను కనబరుస్తారో.. జంతువుల పట్ల కూడా అంతే ప్రేమను కనబరుస్తుంటారు. అయితే మరికొందరరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. చిన్న పిల్లలు..
కొందరు సాటి మనుషులపై ఎంత ప్రేమను కనబరుస్తారో.. జంతువుల పట్ల కూడా అంతే ప్రేమను కనబరుస్తుంటారు. అయితే మరికొందరరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. చిన్న పిల్లలు, మూగ జీవాల పట్ల రాక్షసంగా ప్రవర్తింస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. భర్తతో కలిసి చెత్త కుండీల వద్దకు కుక్క పిల్లలను తీసుకొచ్చిన మహిళ.. చివరకు ఏం చేసిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పారిష్లో (Parish) చోటు చేసుకుంది. సాధారణంగా రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీల్లో అందరూ ఇళ్లల్లోని చెత్తాచెదారం మొత్తం పడేస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి ప్రవర్తన చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భర్తతో కలిసి ఇంటి నుంచి కుక్క పిల్లను ఎత్తుకొచ్చిన ఓ మహిళ.. దాన్ని నేరుగా రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీ వద్దకు తీసుకొచ్చింది. ఆమె వెంటే ఇంకో కుక్క పిల్ల కూడా పరుగెత్తుకుంటూ వచ్చింది.
చెత్త కుండీ వద్దకు రాగానే.. ముందుగా తన చేతిలోని (woman threw the puppies in dustbin) కుక్క పిల్లను అందులో పడేసింది. తర్వాత ఆమె కింద ఉన్న మరో కుక్క పిల్లను చేతిలోకి తీసుకుని, దాన్ని కూడా చెత్త కుండీలో పడేసింది. ఆ తర్వాత ఆమె తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే తర్వాత స్థానికులు ఈ కుక్క పిల్లలను కాపాడినట్లు తెలిసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ జంటను కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘మూగజీవాలను హింసించడం నేరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: వాహనాలు ఢీకొనే క్షణాల ముందు ఏం జరుగుతుందో.. కళ్లకు కట్టినట్లు చూపించారుగా..