Share News

Viral Video: కూర్చుని కూడా భయపెడుతున్న అమ్మాయి.. ఇంతకీ ఈమె చేసిన పని చూస్తే..

ABN , Publish Date - Jun 05 , 2024 | 09:28 PM

కొందరు యువతులు చిత్రవిచిత్ర సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరు మహిళలు.. మగవారు కూడా చేయలేని పనులను సైతం చేస్తూ అంతా షాక్ అయ్యేలా చేస్తుంటారు. ప్రస్తుత...

Viral Video: కూర్చుని కూడా భయపెడుతున్న అమ్మాయి.. ఇంతకీ ఈమె చేసిన పని చూస్తే..

కొందరు యువతులు చిత్రవిచిత్ర సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరు మహిళలు.. మగవారు కూడా చేయలేని పనులను సైతం చేస్తూ అంతా షాక్ అయ్యేలా చేస్తుంటారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు లైక్‌లు, వ్యూస్ కోసం ఇలాంటి అనేక సాహసాలు చేస్తుండడం చూస్తు్న్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి కూర్చుని కూడా అందరినీ భయపెడుతోంది. ఇంతకీ ఈమె చేసిన పని చూడండి..


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) విచిత్ర సాహసానికి (strange adventure ) పూనుకుంది. పర్వతంపై కూర్చోవాలని నిర్ణయించుకుంది. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. ఆమె కూర్చున్నది పర్వతంపైనే అయినా అది ఎలాంటి పర్వతమో, ఎక్కడ కూర్చున్నదో తెలిస్తే ఖంగుతింటారు. అత్యంత ఎత్తైన పర్వతం (highest mountain) పైకి ఎక్కిన సదరు యువతి.. మెల్ల మెల్లగా పర్వతం చివర అంచుకు వచ్చి కూర్చుంది. అక్కడి నుంచి కొంచెం కిందకు జరిగినా నేరుగా వచ్చి కొన్ని వందల అడుగుల కిందకు పడిపోయే ప్రమాదం ఉంటుంది.

Viral Video: వాహనాలు ఢీకొనే క్షణాల ముందు ఏం జరుగుతుందో.. కళ్లకు కట్టినట్లు చూపించారుగా..


అంత పెద్ద పర్వతం మీద కూర్చోవడం మాట అటుంచితే.. దూరం నుంచి చూసినా కళ్లు తిరిగి కిందపడేంత పరిస్థితి. అయినా ఆమె మాత్రం ఏమాత్రం భయం లేకుండా.. అంత పైన కూర్చుని నవ్వుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఘటనను ఆమె స్నేహితులు వీడియో తీసి, సోషల్ మీడియలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! చూస్తుంటేనే భయమేస్తోంది బాబోయ్’’.. అంటూ కొందరు, ‘‘ఈమె ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి సాహసాలు చేయడం ప్రమాదం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొతం చేసుకుంది.

Viral Video: ఈమేంటీ భర్తతో కలిసి మరీ ఇలా చేసిందీ.. చెత్త కుండీల వద్దకు కుక్క పిల్లలను తీసుకొచ్చి..

Updated Date - Jun 05 , 2024 | 09:29 PM