Optical illusion: చురుకైన చూపు ఉన్న వారు మాత్రమే.. ఈ సరస్సులో దాక్కున్న మొసలిని 20 సెకన్లలో కనుక్కోగలరు..
ABN , Publish Date - Oct 04 , 2024 | 04:08 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పెద్ద సరస్సులో చెట్లు కనిపిస్తుంటాయి. అలాగే కొన్ని ఎండిపోయిన కొమ్మలు నీళ్లలో పడిపోయి ఉంటాయి. నీటిలోంచి గడ్డి మొక్కలు పొడుచుకుని బయటికి వచ్చి కనిపిస్తుంటాయి. అయితే ఇందులో మీ కంటికి కనిపించకుండా ఓ మొసలి కూడా దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించడి..
సోషల్ మీడియాలో వినోదం, విజ్ఞానం, మానసికకోళ్లాసం అందించే అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్, పజిల్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయనడంతో ఎలాంటి సందేహం లేదు. కొన్ని పజిల్స్‌ను పరిష్కరించడం ఎంతో కష్టంగా ఉంటుంది. కానీ ఇలాంటి వాటికి సమాధానాలు కనుక్కునేందుకు ప్రయత్నించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కాలక్షేపం అవడంతో పాటూ మెదడుకూ విశ్రాంతి లభిస్తుంది. తాజాగా, ఓ ఆప్టికల్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ సరస్సులో దాక్కుని ఉన్న మొసలిని 20 సెకన్లలో గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉందని అర్థం.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పెద్ద సరస్సులో చెట్లు కనిపిస్తుంటాయి. అలాగే కొన్ని ఎండిపోయిన కొమ్మలు నీళ్లలో పడిపోయి ఉంటాయి. నీటిలోంచి గడ్డి మొక్కలు పొడుచుకుని బయటికి వచ్చి కనిపిస్తుంటాయి.
ఈ చిత్రాన్ని ఎంత సేపు చూసినా అక్కడ నీళ్లు, మొక్కలు, చెట్ల కొమ్మలు తప్ప ఇంకేమీ కనిపించవు. అయితే మీకు తెలీని విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో మీ కంటికి కనిపించకుండా ఓ మొసలి (crocodile hiding in lake) కూడా దాక్కుని ఉంది. అయితే దాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదు. అలాగని పెద్ద కష్టం కూడా కాదు.
అయితే కాసేపు మీ ఆలోచనలను పక్కన పెట్టి కేవలం ఈ చిత్రంపై మాత్రమే దృష్టి పెట్టాలి. మనసు, దృష్టిని ఈ చిత్రంపైనే నిలిపి, నిశితంగా పరిశీలిస్తే మొసలిని గుర్తించడం చాలా సులభం. ఎంతో మంది ఈ సరస్సులోని మొసలిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పది మందిలో ముగ్గురు మాత్రమే ఆ మొసలిని గుర్తించగలుగుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం ఆ మొసలి ఎక్కడుందో గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ మొసలిని గుర్తించడం మీ వల్ల కాకపోతే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..