Share News

Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న ఎలుకను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:18 PM

కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా అనిపిస్తుంటాయి. ఎన్నిసార్లు గమనించినా అందులోని దాక్కున్న రహస్యాన్ని గుర్తించడం సాధ్యం కాదు. అయితే కాస్త ఓపికతో తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం ఇలాంటి ఫజిళ్లకు సమాధానాలు కనుక్కోవడం చాలా సులభం. ఇలాంటి...

Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న ఎలుకను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా అనిపిస్తుంటాయి. ఎన్నిసార్లు గమనించినా అందులోని దాక్కున్న రహస్యాన్ని గుర్తించడం సాధ్యం కాదు. అయితే కాస్త ఓపికతో తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం ఇలాంటి ఫజిళ్లకు సమాధానాలు కనుక్కోవడం చాలా సులభం. ఇలాంటి ఆసక్తికర ఫొటోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఓ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న సింహం చిత్రంలో ఓ ఎలుక దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ సింహం (lion) పొడవాటి జూలుతో చూసేందుకు భయకంరంగా ఉంది. వేట కోసం తీక్షణంగా చూస్తూ ఉంది. దాని కంట పడిన వేటను నోట కరుచుకుని వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సింహానికి కనిపించకుండా ఓ చిట్టెలుక (rat) అక్కడే దాక్కుని ఉంది. ఎక్కడో దాక్కుంటో సింహం కనిపెట్టేస్తుందనే భయంతో.. ఏకంగా సింహంపైనే దాక్కుంది.

Viral Video: వామ్మో..! ఈ ఆంటీ చోరీ మామూలుగా లేదుగా.. వెనుక నుంచి ఢీకొట్టి మరీ ఎలాంటి అనుమానం రాకుండా..

సింహం మీదనే ఉండడంతో దాన్ని గుర్తించేందుకు వీలు లేకుండా ఉంది. ఆ ఎలుక ఎక్కడుందో కనిపిట్టేందుకు కనీసం మీరైనా ప్రయత్నించండి. మీకు 20 సెకన్ల సమయం ఇస్తున్నాం.. ఈలోగా దాన్ని కనిపెట్టారంటే మీ చూపు పవర్‌ఫుల్ అని అర్థం. ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్టెలుక ఎక్కడుందో కనిపెట్టేందుకు ప్రయత్నించండి. ఎంత ప్రయత్నించినా ఎలుకను కనిపెట్టడం మీ వల్ల సాధ్యం కాకుంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటోను చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

lion-optical-illusion-viral.jpg

Viral Video: వివాహాల్లో భోజనాల వద్ద.. ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడైనా చూశారా.. ఐడియా అదుర్స్ అంటున్న నెటిజన్లు..

Updated Date - Apr 03 , 2024 | 03:18 PM