Share News

Viral Video: బద్ధకించిన రెండు సింహాలు.. పరుగెత్తే ఓపిక లేక.. చిన్న పందిని ఎంత సింపుల్‌గా వేటాడాయో చూడండి..

ABN , Publish Date - Feb 11 , 2024 | 09:24 PM

పులులు, సింహాల వేట ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి జంతువునైనా, ఎంత దూరంలో ఉన్నా.. సుడిగాలి వేగంతో వెళ్లి నోట కరుచుకెళ్తుంటాయి. కొన్నిసార్లు వీటి వేట చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అయితే ...

Viral Video: బద్ధకించిన రెండు సింహాలు.. పరుగెత్తే ఓపిక లేక.. చిన్న పందిని ఎంత సింపుల్‌గా వేటాడాయో చూడండి..

పులులు, సింహాల వేట ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి జంతువునైనా, ఎంత దూరంలో ఉన్నా.. సుడిగాలి వేగంతో వెళ్లి నోట కరుచుకెళ్తుంటాయి. కొన్నిసార్లు వీటి వేట చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అయితే అప్పుడుప్పుడూ ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. కొన్ని పులులు, సింహాలు చాలా తెలివిగా వేటాడుతుంటాయి. పరుగెత్తే పని పెట్టుకోకుండా సింపుల్‌గా పని కానిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, సింహాల వేటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బద్ధకించిన రెండు సింహాలు.. పరుగెత్తే ఓపిక లేక.. చిన్న పందిని సింపుల్‌గా వేటాడాయి.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా సింహాలు (lions) ఎలాంటి జంతువునైనా వెంటాడి వెంటాడి మరీ వేటాడుతుంటాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో రెండు సింహాలు చాలా తెలివిగా వ్యవహరించాయి. దారిలో ఎదురుపడిన చిన్న పందిని (pig) చూడగానే వెంటనే పక్కనే ఉన్న గడ్డిలోకి వెళ్లి దాక్కున్నాయి. ‘‘పరుగెత్తే ఓపిక ఏమాత్రం లేదు.. కానీ ఈ పందిని మాత్రం వదలొద్దు’’.. అని అనుకున్నాయో ఏమో గానీ ఆ పంది సమీపానికి వచ్చే వరకూ చాలా సేపు అలా గడ్డిలోనే దాక్కున్నాయి. పంది తన ధ్యాసలో తాను సింహాలు సమీపానికి వస్తుంది.

Viral Video: ఏవమ్మా..! అది కొండచిలువ అనుకున్నావా.. కోడిపిల్ల అనుకున్నావా.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

పంది ఇలా దగ్గరికి రాగానే వెంటనే ఆ రెండు సింహాలు అలెర్ట్ అవుతాయి. ఎటాక్.. అన్నట్లుగా వెంటనే గడ్డి పొదల్లోంచి పందిపై దాడి చేస్తాయి. సింహాలను చూసి భయపడ్డ పంది తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ సింహాలు దగ్గరలోనే ఉండడం వల్ల అది సాధ్యం కాదు. చివరకు రెండు సింహాలు పందిని పట్టుకుని రోడ్డు పక్కకు తీసుకెళ్తాయి. ఇలా సింహాల నిరీక్షణ చివరకు విజయవంతమైంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. రెండేళ్ల కిందట షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సుడిగాలి వస్తుందేమో అనుకున్నారు.. కానీ సమీపానికి వచ్చాక చూస్తే.. మైండ్ బ్లాకింగ్ సీన్...

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Feb 11 , 2024 | 09:29 PM

News Hub