Viral Video: హవ్వ..! ఎంత పని చేసిందీ అవ్వ.. ఆస్పత్రి ఐసీయూ బెడ్‌పై పడుకున్న ఆమె.. అంతలోనే..
ABN , Publish Date - Feb 10 , 2024 | 06:14 PM
బహిరంగ ప్రదేశాల్లో కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. మరికొందరు నెట్టింట వైరల్ అయ్యేందుకు ఏదో ఒక పని చేసి చివరకు ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇంకొందరు...
బహిరంగ ప్రదేశాల్లో కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. మరికొందరు నెట్టింట వైరల్ అయ్యేందుకు ఏదో ఒక పని చేసి చివరకు ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇంకొందరు తమ అలవాట్ల కారణంగా చివరకు చిక్కుల్లో పడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వృద్ధురాలు చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆస్పత్రి ఐసీయూ బెడ్‌పై పడుకున్న వృద్ధురాలు.. అంతలోనే అంతా అవాక్కయ్యేలా చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘హవ్వ..! ఎంత పని చేసిందీ అవ్వ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బీహార్ పాట్నాలోని (Bihar Patna) ఎయిమ్స్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని వార్డులో చాలా మంది రోగులు బెడ్లపై పడుకుని ఉన్నారు. వారితో పాటూ ఓ వృద్ధురాలు కూడా బెడ్‌పై పడుకుని ఉంది. ఇందులో ఎలాంటి విశేషమూ లేకున్నా.. ఈ అవ్వ చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. అప్పటివరకూ విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధురాలు.. అంతలోనే లేచి కూర్చుంది. కాసేపటికి తన వద్ద ఉన్న బీడీని బయటికి తీసి వెలిగించింది. బీడీ తాగుతున్న వృద్ధురాలిని (old woman smoked in the hospital ICU ward) చూసి అంతా షాక్ అయ్యారు.
కొందరు నవ్వుకుంటూ ఆమెను వీడియో తీస్తున్నారు. మరికొందరు నవ్వుతూ డాక్టర్‌ని పిలవండి.. అంటూ ఆమెను ఆటపట్టించారు. అయినా వృద్ధురాలు ఏమాత్రం భయం లేకుండా తాపీగా బీడీ తాగుతూ ఉంది. తర్వాత కాసేపటికి బీడీని ఆర్పేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో!.. ఈ అవ్వ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అవ్వా!.. ఇలాంటి అలవాట్లు అరోగ్యానికి ప్రమాదం’’.. అంటూ మరికొందరు, ‘‘ఆస్పత్రిలో మెయింటెనెన్స్.. ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.