Air Conditioners: వర్షాకాలంలో ఏసీ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి.. అలా చేస్తే అనారోగ్యం తప్పదు..!
ABN , Publish Date - Jul 14 , 2024 | 12:51 PM
వర్షాకాలం వచ్చింది. ఈ సమయంలో మీ ఎలక్ట్రానిక్ పరికరాలను నీటి నుంచి సురక్షితంగా ఉంచుకోవడం పెద్ద సవాలేనని చెప్పవచ్చు. అంతేకాదు ఏసీల(Air Conditioners) విషయంలో ఈ సీజన్లో ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలం వచ్చింది. ఈ సమయంలో మీ ఎలక్ట్రానిక్ పరికరాలను నీటి నుంచి సురక్షితంగా ఉంచుకోవడం పెద్ద సవాలేనని చెప్పవచ్చు. అంతేకాదు ఏసీల(Air Conditioners) విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో(rainy Season) ఎక్కువగా తేమ, జిగట పరిస్థితి ఉంటుంది. కాబట్టి వేసవిలో మాదిరిగా ఏసీలను ఆపరేట్ చేయోద్దు. అందువల్ల ఈ సీజన్‌లో ఏసీని ఎల్లప్పుడూ డ్రై మోడ్‌లో ఉపయోగించాలి. ఆ క్రమంలో ఉష్ణోగ్రత 24 నుంచి 26 మధ్య ఉంచుకోవాలి. దీంతోపాటు ఏసీ మీద నీటి చుక్కలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
డ్రై మోడ్
వర్షాకాలంలో గాలిలో తేమ స్థాయి చాలా ఎక్కువగా ఉండటంతో ఇంటి లోపల కూడా తేమగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏసీని ఉపయోగించాలనుకుంటే కూల్ మోడ్‌కు బదులుగా డ్రై మోడ్‌ను ఉపయోగించడం ఉత్తమం. ఇది గదికి చల్లదనాన్ని తీసుకురావడమే కాకుండా తేమను కూడా తొలగిస్తుంది. కూల్ మోడ్ పూర్తిగా పనికిరాదని దీని అర్థం కాదు. తక్కువ వర్షం ఉంటే, గాలిలో ఎక్కువ తేమ లేనట్లయితే మీరు కూల్ మోడ్‌ను కూడా ఉపయోగించవచ్చు.
తక్కువగా కూడా
వర్షాకాలంలో AC ఉష్ణోగ్రత చాలా తక్కువగా కూడా ఉంచవద్దు. ఎందుకంటే ఆ సమయంలో బయట గాలి చల్లగా ఉంటుంది. కాబట్టి చాలా చల్లగా ఉన్న గది మీ శరీరానికి హానికరం. 24 కంటే తక్కువ సెల్సియస్ ఉష్ణోగ్రత మీకు తగినంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. ఆ క్రమంలో మీరు తప్పు మోడ్‌ని ఉపయోగించడం వల్ల మీ విద్యుత్ బిల్లు పెరగడమే కాకుండా మీరు అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశం ఉంది.
స్వచ్ఛమైన గాలి కోసం
దీంతోపాటు ఏసీ ఫిల్టర్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఇది AC సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా గదిలోని గాలిని శుభ్రంగా ఉంచుతుంది. ఏసీని నడుస్తున్నప్పుడు గదిలో గాలి ప్రసరణ కోసం కొద్దిసేపు కిటికీలు తెరవడం ద్వారా స్వచ్ఛమైన గాలి లోపలికి వస్తుంది. రోజంతా ఏసీని నడపకుండా అవసరాన్ని బట్టి మాత్రమే వాడండి. కాసేపు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. దీంతోపాటు విద్యుత్ కూడా మీకు ఆదా అవుతుంది.
ఇవి కూడా చదవండి..
Anant Ambani: అనంత్ అంబానీ మళ్లీ బరువు ఎందుకు పెరిగాడు? 108 కిలోలు తగ్గిన తర్వాత ఏం జరిగింది..?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..