Share News

Car Accident: సెల్ ఫోన్ చూస్తూ రోడ్డు దాటే అలవాటు ఉందా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..

ABN , Publish Date - Nov 14 , 2024 | 04:15 PM

ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో ట్రెండీగా మారాయి.

Car Accident: సెల్ ఫోన్ చూస్తూ రోడ్డు దాటే అలవాటు ఉందా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో రోజుకు వందల మంది మరణిస్తుంటారు. ఇక రోడ్డు ప్రమాదాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాహనం నడిపేవారు ఏమాత్రం అశ్రద్ధ వహించినా కళ్లు మూసి తెరిచే లోపు ప్రమాదానికి గురవుతారు. కొంతమంది రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోవడం లేదా ఎదుటివారి ప్రాణాలు తీయడం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి. అయితే కొంతమంది సెల్ ఫోన్ చూస్తూ వాహనాలు నడుపుతుంటారు. మరికొంత మంది మెుబైల్ ఫోన్లు చూస్తూ ఏదో ఇంట్లో నడిచినట్లుగా మనకేంటిలే అన్నట్లు రోడ్లు దాటుతుంటారు. ఇలాంటి వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సింగపూర్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.


ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో ట్రెండీగా మారాయి. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. రోడ్డు దాటేందుకు ఎదురు చూస్తున్న యువతి గ్రీన్ సిగ్నల్ పడగానే రోడ్ క్రాస్ చేసేందుకు బయలుదేరింది. అయితే ఆమె అప్పటికే తన మొబైల్ ఫోన్‌లో పూర్తిగా లీనమైపోయింది. ఎదురుగా వస్తున్న వాహనాలను సైతం గమనించలేని స్థితిలో ఆమె నడుస్తోంది. పూర్తి నిర్లక్ష్యంగా అడుగులో అడుగు వేసుకుంటూ రోడ్డు దాటుతోంది. అయితే అదే సమయంలో ఓ కారు అతివేగంతో యువతి వైపు దూసుకొచ్చింది. గ్రీన్ లైట్ పడిన విషయాన్ని కూడా గమనించకుండా ఓవర్ స్పీడ్‌తో మహిళ వైపు అతివేగంగా వచ్చింది.


వేగంగా వచ్చిన ఆ కారు ఆమెను ఒక్కసారిగా బలంగా ఢీకొట్టింది. దీంతో యువతి ఎగిరి కొన్ని మీటర్ల దూరంలో పడిపోయింది. గాలో చాలా ఎత్తుకు ఎగిరి గింగిరాలు తిరుగుతూ కిందపడిపోయింది. క్షణాల వ్యవధిలోనే ఆ యువతి లేచి కూర్చుంది. కాసేపు ఆమెకు ఏం జరిగిందో అర్థంకాక షాక్‌కు కాగా.. ప్రమాదం జరగడంతో డ్రైవర్ సైతం షాక్‍కు గురయ్యాడు. లేచి కూర్చున్న మహిళ మెల్లిగా పక్కన పడిపోయిన ఫోన్ వైపు మోకాళ్లపై వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే గాయాలు కావడంతో తన వల్ల కాక అక్కడే కూర్చిండిపోయింది. ఇంతలో కారు డ్రైవర్, మరో వ్యక్తి కిందకు దిగి వచ్చి ఆమె వైపు పరుగులు తీశారు. యవతిని సముదాయించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన సింగపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


అయితే ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కారు డ్యాష్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువతి, డ్రైవర్ ఇద్దరిపైనా నెటిజన్లు మండిపడుతున్నారు. "కారు అంత వేగంగా నడపడం అవసరమా" అంటూ కొందరు.. "కనీసం గ్రీన్ లైట్ కూడా గమనించకుండా నడుపుతారా" అంటూ మరికొందరు.. "రోడ్డు దాటేటప్పుడు మెుబైల్ ఫోన్ చూడడం అవసరమా" అంటూ ఇంకొందరు.. "ఈమెకు భూమిపై ఇంకా నూకలు మిగిలే ఉన్నాయి" అంటూ మరికొందరూ ఇద్దరినీ తిట్టిపోస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Updated Date - Nov 14 , 2024 | 04:17 PM