Share News

Delhi Metro: రీల్ కోసం మెట్రో రైలులో హద్దుమీరిన యువతి

ABN , Publish Date - Jul 22 , 2024 | 05:05 PM

ఈమధ్య కాలంలో బహిరంగ ప్రదేశాల్లో రీల్స్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా.. మాల్స్, మెట్రో స్టేషన్స్, రైళ్లలో డ్యాన్స్ వీడియోలు చేస్తూ కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు రచ్చ రచ్చ..

Delhi Metro: రీల్ కోసం మెట్రో రైలులో హద్దుమీరిన యువతి
Woman Dance Reel

ఈమధ్య కాలంలో బహిరంగ ప్రదేశాల్లో రీల్స్ (Instagram Reels) చేయడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా.. మాల్స్, మెట్రో స్టేషన్స్, రైళ్లలో డ్యాన్స్ వీడియోలు చేస్తూ కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు (Influencers) రచ్చ రచ్చ చేస్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం విభిన్న ప్రదర్శనలు చేస్తున్నారు. తమ చర్యల కారణంగా ఇతరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఇంకితజ్ఞానం కూడా లేకుండా హద్దుమీరుతున్నారు. ఇప్పుడు తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు.. ఓ యువతి ఢిల్లీ మెట్రో రైలులో (Delhi Metro) రెచ్చిపోయింది. ఇన్‌స్టా రీల్ కోసం జనాలు చూడలేని రీతిలో నృత్య ప్రదర్శన చేసింది. దీంతో.. ఈ వ్యవహారం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.


ఆ యువతి పేరు మనీషా. ఇలాంటి వివాదాస్పద వీడియోలు చేయడమే ఆమె పని. గతంలో ఓసారి చిట్టిపొట్టి దుస్తుల్లో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో.. ఇక అప్పటి నుంచి పబ్లిక్ ప్రాంతాల్లో వీడియోలు చేయడమే పనిగా పెట్టుకుంది. గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా, ఇతర చర్యలు తీసుకున్నా.. ఆమెలో మార్పు మాత్రం రాలేదు. తన వీడియోలు వైరల్ అవుతుండటం, తన పేరు కూడా సోషల్ మీడియాలో మార్మోగిపోతుండటంతో.. బహిరంగ ప్రాంతాల్లో వీడియోలు చేయడం కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆ యువతి తాజాగా ఢిల్లీ మెట్రోలో మరో వీడియో చేసింది. తన చుట్టూ చాలామంది జనం ఉన్నా.. తన టాప్ పైకి లేపుతూ, నడుము చూపిస్తూ డ్యాన్స్ చేసింది. ఓ భోజ్‌పురి పాటకు చిందులేసింది. అనంతరం తన స్టేషన్ రాగానే.. బ్యాగు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా ఒక స్క్రిప్టులో భాగమేనని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.


ఈ వీడియోని మనీషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా అది వైరల్ అయ్యింది. దీంతో.. నెటిజన్లు ఆమెపై నిప్పులు చెరుగుతున్నారు. ఇతరుల మనోభావాలను పట్టించుకోకుండా.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా బహిరంగ ప్రదేశాలను తమ వేదికలుగా ఉపయోగించుకోవడం నిజంగా అసంతృప్తిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. ఇలాంటి వీడియోలు చేయడం పరిపాటిగా మారిపోయిందని నిప్పులు చెరుగుతున్నారు. ఆ యువతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ యూజర్ ఈ వీడియోపై స్పందిస్తూ.. చుట్టుపక్కల ఉన్న జనాళ్లు గట్టిగా వారించేదాకా వీళ్లు మారరని, ఇలాగే చిందిలేస్తుంటారని విమర్శించాడు. మరొకరు.. అసలు మెట్రోలో ఫ్యామిలీతో వెళ్లాలంటేనే భయం వేస్తోందని, ఇలాంటి వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు.

Read Latest Prathyekam News and Telugu News

Updated Date - Aug 02 , 2024 | 06:38 PM