Share News

Viral: తన షాపు ముందు క్యూకట్టిన ఆవులు.. ఈ మహిళ ఏం చేసిందో చూస్తే..

ABN , Publish Date - May 13 , 2024 | 09:47 PM

ఆకలితో ఫుడ్ స్టాల్ వద్దకు వచ్చిన రెండు ఆవులకు ఓ మహిళ చపాతీలు పెట్టిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: తన షాపు ముందు క్యూకట్టిన ఆవులు.. ఈ మహిళ ఏం చేసిందో చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: మనుషులు జంతువులపై తమ ప్రేమాభిమానాలను ఒక్కో విధంగా చాటుకుంటూ ఉంటారు. కొందరు వాటికి ఆశ్రయం కల్పిస్తే మరికొందరేమో జంతువులకు ఆశ్రయం కల్పించే సంస్థలకు విరాళాలు ఇస్తుంటారు. మరికొందరు మరింత సింపుల్‌గా ఆకలితో ఉన్న జంతువులకు తమకు చేతనైన మేరకు ఆహారం పెట్టి మానవత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. అలాంటి ఓ వీడియో (Viral) ప్రస్తుతం నెటిజన్లు అమితంగా ఆకట్టుకుంటోంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రెండు ఆవులు ఓ ఫుడ్ స్టాల్ ముందు ఆగాయి. ఆకలిగా ఉన్నట్టు కనిపిస్తున్న ఆ రెండు ఆవులు స్టాల్‌లోని మహిళ పెట్టే ఫుడ్ కోసం ఆశగా ఎదురు చూశాయి. మొదట ఓ ఆవుకు మహిళ తన షాపులోని చపాతీ ఇస్తుంది. దీంతో, అది ఆ ఒక్క చెపాతీ తీసుకుని వెళ్లిపోతుంది. దాని వెనకాలే ఉన్న మరో ఆవు వచ్చి మళ్లీ మహిళనే చూస్తూ నిలబడింది. ఈ సారి ఫుడ్ స్టాల్‌లోని మహిళ రెండో ఆవుకూ ఓ చెపాతీ ఇచ్చింది. అది తిన్న ఆవు అక్కడి నుంచి వెళ్లిపోయింది (Woman feeds cow rotis video goes viral ).

Viral: మనిషి రక్తానికి రెండు చుక్కల పాము విషం కలపగానే.. షాకింగ్ వీడియో!


రెండు ఆవులు సరిగ్గా ఒక్క చెపాతీ తిని అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోవడం నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. ఆవులు మహిళకు బాగా తెలిసే ఉంటాయని కొందరు ఈ వీడియో చూసి కామెంట్ చేశారు. ఆవులు జ్ఞానమున్న జంతువులని కొందరు అన్నారు. మనిషిని మనిషే పట్టించుకోని నేటి కాలంలో ఇలా జంతువులపై దయ చూపుతున్న మహిళపై అనేక మంది ప్రశంసల వర్షం కురిపించారు.

Read Viral and Telugu News

Updated Date - May 13 , 2024 | 09:51 PM