Share News

Viral: విమానంలో రెచ్చిపోయిన మహిళ.. సీటులో కాళ్లు జాపుకునేందుకు చోటు లేదని..

ABN , Publish Date - May 10 , 2024 | 04:00 PM

విమానం సీటులో కాళ్లు జాపుకునేందుకు కావాల్సినంత స్థలం లేదని భావించిన ఓ మహిళ ఏకంగా లగేజీ పెట్టే స్థలంలో పడుకుని ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఈ ఘటన జరిగింది.

Viral: విమానంలో రెచ్చిపోయిన మహిళ..  సీటులో కాళ్లు జాపుకునేందుకు చోటు లేదని..

ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘవిమాన ప్రయాణాల్లో చాలా మంది కోరుకునేది లెగ్ స్పేస్. కాళ్లు కాస్తంత జాపుకునేందుకైనా కొంచెం జాగా అయినా ఉండాలని జనాలు కోరుకుంటారు. కానీ, అది అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ అల్బకర్కీ నుంచి ఫీనిక్స్‌కు వెళ్లేక్రమంలో ఓ అసాధారణ పని చేసింది. విమానంలో సీటుకు పైన లగేజీ పెట్టుకునే స్థలంలో పడుకుని ప్రయాణించింది. మహిళను అలా చూసిన తోటి ప్రయాణికులందరూ షాకైపోయారు. కొందరు ఆమె తీరును చూసి పడిపడి నవ్వుకున్నారు. అయితే, ఇతర ప్యాసెంజర్లు నవ్వుతున్నా ఆమె మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఫ్లైట్ ఎంజాయ్ చేసింది. ఇలా ఎంతసేపు ఆమె ప్రయాణించిందో మాత్రం తెలియరాలేదు (Woman Shocks Passengers After She Was Spotted Sleeping In Planes Overhead Bin).

Viral: ఇదేం పని తల్లీ.. స్కూటీపై వెళుతున్న మహిళను చూసి జనాలు షాక్..!


ఇందుకు సంబంధించి వీడియో జనాలను షాకయ్యేలా చేస్తోంది. వేల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అనేక మంది మహిళ తీరుకు ఆశ్చర్యపోయారు. కొందరు ఆమెను తిట్టిపోస్తే మరికొందరు మాత్రం ప్రశంసించారు. ఆమె అసలు ప్రయాణికురాలా లేక విమాన సిబ్బందా అన్న డౌట్‌ కూడా వచ్చింది.

అయితే, గతంలోనూ లగేజీ కంపార్ట్‌మెంట్లలో జనాలు ప్రయాణించిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. ఓసారి సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఒకరు ఇలాగే లగేజీ క్యాబిన్‌లో దాక్కుని ప్రయాణికులను సర్‌ప్రైజ్ చేశారు. ఈ ఘటన తాలుకు వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.

Read Viral and Telugu News

Updated Date - May 10 , 2024 | 04:15 PM