Share News

Viral Video: ఒకే చెప్పు ఉందని పక్కన పడేస్తున్నారా.. ఇతడు ఎలా వాడేశాడో చూస్తే.. ఖంగుతింటారు..

ABN , Publish Date - Sep 06 , 2024 | 03:28 PM

‘‘తెలివి ఒకరి సొత్తు కాదు’’.. అనే సామెత చందంగా.. వినూత్నంగా ఆలోచించాలే గానీ పనికి రాదు అనుకున్న వస్తువులను కూడా తిరిగి వినియోగించుకోవచ్చు. కొందరు పక్కన పాడేసిన వస్తువులతో చిత్రవిచిత్రం ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. పాత వస్తువులన్నీ కలిపి కొత్తగా మార్చి ..

Viral Video: ఒకే చెప్పు ఉందని పక్కన పడేస్తున్నారా.. ఇతడు ఎలా వాడేశాడో చూస్తే.. ఖంగుతింటారు..

‘‘తెలివి ఒకరి సొత్తు కాదు’’.. అనే సామెత చందంగా.. వినూత్నంగా ఆలోచించాలే గానీ పనికి రాదు అనుకున్న వస్తువులను కూడా తిరిగి వినియోగించుకోవచ్చు. కొందరు పక్కన పాడేసిన వస్తువులతో చిత్రవిచిత్రం ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. పాత వస్తువులన్నీ కలిపి కొత్తగా మార్చి వినూత్నంగా వాడుకలోకి తెస్తుంటారు. ఇలాంటి వింత వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఉన్న ఒక చెప్పును పక్కన పడేయకుండా వినియోగించిన తీరు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన ఇంట్లో మూలన పడి ఉన్న తన ఒక్క చెప్పును తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని అనుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరగా అతడికి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. ఫోన్లు చార్జింగ్ పెట్టే సమయంలో వాటిని టేబుల్ పైన లేదా ప్రత్యేకంగా తయారు చేసిన స్టాండ్‌ల మీద ఏర్పాటు చేస్తుంటాం.

Viral Video: ఇలాంటి చోరీ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. ఎంత సింపుల్‌గా ఎత్తుకెళ్లాడంటే..


అయితే ఇతను మాత్రం అందుకోసం ఎలాంటి ఖర్చు చేయకుండా ఏర్పాటు చేయాలని ఆలోచించాడు. మూలన పడ్డ చెప్పును (slipper) చూడగానే.. దాన్నే స్టాండ్‌గా అమర్చాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా.. చెప్పును గోడకు తలకిందులుగా ఏర్పాటు చేశాడు. తర్వాత చార్జింగ్ పెట్టిన ఫోన్‌ని.. చెప్పు మధ్యలో పెట్టాడు. ఇది చూడ్డానికి అచ్చం ఫోన్ స్టాండ్‌లానే ఉంది. ఇలా ఆ యువకుడు ఉన్న ఒక చెప్పును ఫోన్ స్టాండ్‌గా (Phone stand) మార్చేశాడన్నమాట.

Viral Video: ఇది మామూలు టెక్నిక్ కాదుగా.. ఆటోను బైక్‌లా కాలితో ఎలా తిప్పేశాడో చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భారత దేశంలో ఇలాంటి అద్భుత తెలివితేటలకు కొదువే లేదు’’.. అంటూ కొందరు, ‘‘ఇప్పటినుంచి ఒక చెప్పు పాడై.. ఇంకోటి మాత్రమే ఉంటే ఇలాగే చేస్తాం’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 86 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: స్కూటీపై లగేజీ తీసుకెళ్తున్న వ్యక్తిపై అనుమానం.. చివరకు సమీపానికి వెళ్లి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 06 , 2024 | 03:28 PM