Viral Video: లిఫ్ట్‌లో షాకింగ్ అనుభవం.. డోరు తెరుచుకున్నా దిగలేక అవస్థలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Jul 24 , 2024 | 03:58 PM
కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు, కొత్త కొత్త వస్తువులను వినియోగించే సమయంలో అవగాహన లేని వారు ఇబ్బందులు పడడం చూస్తుంటాం. కొందరు పల్లెటూరు నంచి సిటీలకు వెళ్లిన సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే ...
కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు, కొత్త కొత్త వస్తువులను వినియోగించే సమయంలో అవగాహన లేని వారు ఇబ్బందులు పడడం చూస్తుంటాం. కొందరు పల్లెటూరు నంచి సిటీలకు వెళ్లిన సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే కొన్నిసార్లు చదువుకున్న వారు కూడా ఇలాంటి అనుభవమే ఎదురవుతుంటుంది. అందులోనూ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మాయలో పడి చాలా మంది వివిధ రకాలుగా ఇబ్బందులు పడడడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. లిఫ్ట్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. డోరు తెరుచుకున్నా దిగలేక ఇబ్బంది పడ్డాడు. చివరకు ఏమైందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు (young man) లిఫ్ట్‌లోకి ఎక్కి తాను వెళ్లాల్సిన ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తాడు. ఆ తర్వాత యథావిధిగా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఫోన్ ధ్యాసలో పడిపోయిన అతను.. తన దిగాల్సిన ఫ్లోర్ వచ్చిందనే మర్చిపోయాడు. ఫ్లోర్ రాగానే ఆటోమేటిక్‌గా లిఫ్ట్ డోర్ (Lift door) తెరుచుకుంటుంటుంది.
Viral Video: లక్ అంటే ఇదేనేమో.. 13వ అంతస్తు నుంచి కిందపడ్డ యువతి.. చూస్తుండగానే.. ఆశ్చర్యకరంగా..
కానీ ఆ వ్యక్తి డోరుకు వ్యతిరేక దిశలో నిలబడి ఫోన్ చూసుకుంటూ ఉండడం వల్ల ఈ విషయం గమనించడు. పైగా చివరకు తన ఫ్లోర్ ఇంకా రాలేదనే ఉద్దేశంతో పదే పదే బటన్ నొక్కుతుంటాడు. దీంతో తెరిచిన డోరు ముందుకు, వెనక్కు కదులుతుంటుంది. అప్పటికీ అతను వెనక్కు చూసుకోకుండా డోరు తెరుచుకోలేదేంటీ.. అని కంగారుగా చూస్తుంటాడు. ఇంతలో ఓ వ్యక్తి లిఫ్ట్ లోపలికి వస్తాడు. దీంతో అతన్ని చూసి యువకుడు ఖంగుతింటాడు. డోర్ తెరుచుకోకున్నా.. ఎలా లోపలికి వచ్చాడబ్బా అని చూసి షాక్ అవుతాడు.
అయితే ఆ తర్వాత డోరు వెనుక వైపు ఉందనే విషయం తెలుసుకుని నాలుక కరుచుకుంటాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘ప్రస్తుతం చాలా మంది ఇలాగే వ్యవహరిస్తున్నారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: అయ్యో.. ఈ జింక బాధ వర్ణణాతీతం.. జన్మనిచ్చిన పిల్లను చూసుకునేలోపే.. ఉన్నట్టుండి..