Share News

Viral Video: లక్ అంటే ఇదేనేమో.. 13వ అంతస్తు నుంచి కిందపడ్డ యువతి.. చూస్తుండగానే.. ఆశ్చర్యకరంగా..

ABN , Publish Date - Jul 23 , 2024 | 08:01 PM

కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ‘‘భూమ్మీద నూకలు మిగిలున్నాయ్’’.. అని అంటూ ఉంటాం. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక...

Viral Video: లక్ అంటే ఇదేనేమో.. 13వ అంతస్తు నుంచి కిందపడ్డ యువతి.. చూస్తుండగానే.. ఆశ్చర్యకరంగా..

కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ‘‘భూమ్మీద నూకలు మిగిలున్నాయ్’’.. అని అంటూ ఉంటాం. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి 13వ అంతస్తు నుంచి కిందపడింది. అయితే చివరకు ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన రష్యాలో (Russia) చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల మహిళ ఇటీవల ఓ రోజు పని మీద ఎత్తైన భవనంపైకి వెళ్లింది. 13 అంతస్తులో ఉండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు (woman fell from the 13th floor) ఆ యువతి 13వ అంతస్తు నుంచి జారి పడింది. నేరుగా కింద ఉన్న గడ్డిలో పడిపోయింది. ధబేల్‌మని ఎగరి పడడంతో కొద్దిసేపు అలాగే కదలకుండా ఉండిపోయింది.

Viral Video: కాలు జారి జలపాతంలో పడ్డ యువకుడు.. అంతెత్తునుంచి కొట్టుకొచ్చినా..


అయితే ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ఆమె మెల్లగా పైకి లేచి కూర్చుంది. స్థానికులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆశ్చర్యకరంగా ఆమెకు ఎలాంటి గాయాలూ కాలేదని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఆమె ఊపిరితిత్తులు స్వల్పంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ఎట్టకేలకు ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Viral Video: జాతరలో రద్దీ జనం మధ్య జంట విచిత్ర నిర్వాకం.. ముద్దులు పెట్టుకుంటూ..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె అదృష్టం మూమూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది నిజంగా మిరాకిల్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి బస్సులు కూడా ఉన్నాయా.. కిటికీ నుంచి ఎక్కుతుండగా.. ఒక్కసారిగా..

Updated Date - Jul 23 , 2024 | 08:01 PM