Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. జాయింట్ వీల్ నుంచి జారిన యువతి.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Dec 06 , 2024 | 05:35 PM
జాతర ఉత్సవాల్లో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకునే వాటిలో జాయింట్ వీల్ ఒకటి. ఉత్సవాలకు ప్రతి వెళ్లే ప్రతి ఒక్కరూ జాయింట్ వీల్ తప్పనిసరిగా ఎక్కుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. మరికొన్నిసార్లు ఏకంగా..
జాతర ఉత్సవాల్లో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకునే వాటిలో జాయింట్ వీల్ ఒకటి. ఉత్సవాలకు ప్రతి వెళ్లే ప్రతి ఒక్కరూ జాయింట్ వీల్ తప్పనిసరిగా ఎక్కుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. మరికొన్నిసార్లు ఏకంగా ప్రాణాలు కూడా పోతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. జాయింట్ వీల్ ఎక్కిన ఓ యువతి అనూహ్యంగా అందులో నుంచి జారి మధ్యలో వేలాడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) లఖింపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక జరుగుతున్న జాతరలో పెద్ద ఎగ్జిబిషన్ (Exhibition) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చాలా మంది అక్కడి జాయింట్ వీల్‌ను (Joint wheel) ఎక్కి సరదాగా గడిపారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
జాయింట్ వీల్‌లో కూర్చున్న ఓ యువతి.. పైకి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు (young woman slipped from joint wheel) అందులో నుంచి జారి బయటికి వచ్చేసింది. కిందపడిబోతుండగా మధ్యలో ఇనుప కడ్డీలను పట్టుకుని వేలాడింది. అంతా కేకలు వేయడంతో జాయింట్ వీల్ నిర్వాహకులు అలెర్ట్ అయ్యారు. వెంటనే జాయింట్ వీల్ వేగాన్ని తగ్గించి, మెల్లగా యువతి కిందకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
Viral Video: ఖడ్గమృగంతో అంత ఈజీ కాదు.. సింహాల పరిస్థితి చివరకు ఏమైందంటే..
ఈ ఘటనలో యువతికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..