Share News

Viral Video: వరద నీటిలో బైకు డ్రైవింగ్.. తీరా బయటికి వచ్చిన తర్వాత చూడగా.. దిమ్మతిరిగే ట్విస్ట్..

ABN , Publish Date - Dec 04 , 2024 | 10:42 AM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వినూత్నంగా ఆలోచించేవారికి పబ్లిసిటీతో పాటూ ఆదాయానికీ కొదవ లేకుండా పోతోంది. చాలా మంది విభిన్నంగా ఆలోచిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ వీడియోలు చేస్తుంటారు. తద్వారా నెట్టింట ఫేమస్ అవడంతో పాటూ డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. సాధారణానికి భిన్నంగా ఆలోచిస్తూ చేసే అనేక రకాల వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా..

Viral Video: వరద నీటిలో బైకు డ్రైవింగ్.. తీరా బయటికి వచ్చిన తర్వాత చూడగా.. దిమ్మతిరిగే ట్విస్ట్..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వినూత్నంగా ఆలోచించేవారికి పబ్లిసిటీతో పాటూ ఆదాయానికీ కొదవ లేకుండా పోతోంది. చాలా మంది విభిన్నంగా ఆలోచిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ వీడియోలు చేస్తుంటారు. తద్వారా నెట్టింట ఫేమస్ అవడంతో పాటూ డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. సాధారణానికి భిన్నంగా ఆలోచిస్తూ చేసే అనేక రకాల వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వరద నీటితో బైకు తోలుతున్నట్లు కనిపించాడు. అతడి వెనుక ఓ పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే నీటి నుంచి బయటికి వచ్చక చూడగా.. దిమ్మతిరిగే ట్విస్ట్ కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వరద నీటిలో (flood water) బైకు నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారు కదా.. అతడు బయటికి వచ్చాక చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి హెల్మెట్ పట్టుకుని వరద నీటిలో (Bike driving) బైకు నడుపుతున్నాడు. తన వెనుక ఓ పిల్లాడిని కూడా కూర్చోబెట్టుకున్నాడు. బైకు పూర్తిగా నీటిలో మునిగిపోయినా అలాగే నడుపుతున్నాడు.

Viral Video: రైలు పట్టాల మధ్యలో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం.. చివరకు ఏమైందో చూస్తే..


నీటిపై కేవలం బండి హ్యాండిల్‌కు ఉన్న అద్దాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయినా సరే బైకు ఆఫ్ కాకుండా అలాగే వస్తోంది. ఇలా ఆ వ్యక్తి నీటిలోంచి మెల్ల మెల్లగా బయటికి వచ్చేశాడు. అయితే తీరా అతను బయటికి వచ్చాక చూడగా అక్కడ బైకే లేదు. కేవలం తలకు హెల్మెట్, చేతుల్లో రెండు బైకు అద్దాలు తప్ప ఇంకేమీ కనిపించవు. బైకు లేకపోయినా ఉన్నట్లుగా వరద నీటిలో అతడి యాక్టింగ్ చూసి అంతా అవాక్కయ్యారు.

Viral Video: సామాన్లు తరలించడం ఇంత ఈజీనా.. ఇతడి ట్రిక్ మామూలుగా లేదుగా..


ఈ వీడిదయో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి నటన మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, 2.21 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏనుగుకు తిక్కరేగితే ఇలాగే ఉంటుంది మరీ.. మొసలిని ఏం చేసిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 04 , 2024 | 10:42 AM