Share News

IPL 2024: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో మ్యాచ్‌ల వివరాలివే!

ABN , Publish Date - Mar 25 , 2024 | 06:06 PM

క్రికెట్ అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ 2024 రెండో విడత షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఐపీఎల్ 17వ సీజన్ రెండో విడత షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మొత్తం టోర్నీలో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.

IPL 2024: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో మ్యాచ్‌ల వివరాలివే!

క్రికెట్ అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ 2024 రెండో విడత షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఐపీఎల్ 17వ సీజన్ రెండో విడత షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మొత్తం టోర్నీలో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. 21 మ్యాచ్‌లకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించగా.. మిగతా 53 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. పూర్తి సీజన్ మన దేశంలోనే జరగనుంది. మే 26న చెన్నై వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మే 24న జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌కు కూడా చెన్నై చిదంబరం స్టేడియమే అతిథ్యం ఇవ్వనుంది. అహ్మదాబాద్ వేదికగా మే 21, 22వ తేదీల్లో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 7 వరకు ఇప్పటికే మొదటి విడత షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎలాంటి గ్యాప్ లేకుండా ఆ మరుసటి రోజు ఏప్రిల్ 8 నుంచే మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి. మలి విడతలో కూడా చెన్నైసూపర్ కింగ్స్ జట్టే మొదటి మ్యాచ్ ఆడనుంది. చెన్నైసూపర్ కింగ్స్, కోల్‌కతానైట్ రైడర్స్ జట్లు ఏప్రిల్ 8న చెన్నై వేదికగా తలపడనున్నాయి. లీగ్ దశలో చివరి మ్యాచ్‌ మే 19న జరగనుంది. చివరి లీగ్ పోటీలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.

ఈ సారి తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఫుల్ క్రికెట్ మజా అందనుంది. గతంలో మాదిరిగానే సన్ రైజర్స్ హైదరాబాద్ హోంగ్రౌండ్ మ్యాచ్‌లన్నీ ఉప్పల్‌లో జరగనున్నాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సారి తొలి విడత షెడ్యూల్‌లో తమ హోంగ్రౌండ్‌గా వైజాగ్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో వైజాగ్‌లో ఢిల్లీ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. హైదరాబాద్‌లో మార్చి 27న, ఏప్రిల్ 5న, ఏప్రిల్ 25న, మే 2న, మే 8న, మే 16న, మే 19న మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆయా తేదీల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్, చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నోసూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లతో తలపడనుంది. మొత్తంగా హైదరాబాద్‌లో 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక వైజాగ్‌లో మార్చి 31న, ఏప్రిల్ 3న రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నైసూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి.


ipl 2024.jfifipl.jfifipl 17.jfifipl 1.jfif


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి.

IPL 2024: ముంబైకి కూడా సన్‌రైజర్స్ గతే పట్టనుందా..? రోహిత్‌ను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదంటున్న ఫ్యాన్స్

IPL 2024: హార్దిక్‌ను కుక్కతో పోల్చిన అభిమానులు.. క్రికెట్ ప్రపంచమంతా రోహిత్ వైపే!



Updated Date - Mar 25 , 2024 | 06:33 PM