Share News

Gautam Gambhir: తప్పంతా నాదే.. వాళ్లకు తిట్టే హక్కు ఉంది: గంభీర్

ABN , Publish Date - Nov 11 , 2024 | 10:42 AM

టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఏ విషయం మీదైనా నిక్కచ్చిగా మాట్లాడతాడు. దేని గురించైనా ధైర్యంగా కామెంట్ చేస్తాడు. అలాంటోడు తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. తమను తిట్టే హక్కు వాళ్లకు ఉందన్నాడు.

Gautam Gambhir: తప్పంతా నాదే.. వాళ్లకు తిట్టే హక్కు ఉంది: గంభీర్

టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఏ విషయం మీదైనా నిక్కచ్చిగా మాట్లాడతాడు. దేని గురించైనా ధైర్యంగా కామెంట్ చేస్తాడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారా? లాంటివి పట్టించుకోడు. డేరింగ్‌గా తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. అలాంటోడు మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తప్పు చేశానని అతడు ఒప్పుకున్నాడు. తమను తిట్టే హక్కు వాళ్లకు ఉందన్నాడు. తాము చేసిన పనికి ఎవ్వరు ఏమన్నా పడాల్సిందేనన్నాడు. దీని నుంచి తప్పించుకోవాలని తాను అనుకోవడం లేదని.. తిట్లు పడాల్సిందేనన్నాడు. ఇంతకీ ఏ సందర్భంగా గౌతీ ఈ వ్యాఖ్యలు చేశాడు? అతడు చేసిన తప్పేంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


తిడితే పడతాం

ఇటీవల ముగిసిన న్యూజిలాండ్‌ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 0-3తో వైట్‌వాష్ అయింది. సొంతగడ్డపై లాంగ్ ఫార్మాట్ మ్యాచుల్లో తిరుగులేని రికార్డు ఉన్న భారత్ ఇంత దారుణంగా ఓడటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. అటు అభిమానులతో పాటు ఇటు ఎక్స్‌పర్ట్స్‌, మాజీ క్రికెటర్ల నుంచి కూడా జట్టు పై, కోచింగ్ స్టాఫ్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. కివీస్ సిరీస్ ఓటమి తమను తీవ్రంగా బాధించిందన్నాడు. తాము చాలా చెత్తగా ఆడామన్నాడు. తమ తప్పు లేదంటూ తప్పించుకోవాలని చూడట్లేదన్నాడు. తమను విమర్శించడం సరైనదేనని చెప్పుకొచ్చాడు గౌతీ.


ఇద్దరిలో ఒకరికి ఛాన్స్

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అన్ని విభాగాల్లోనూ భారత జట్టు విఫలమైందని.. తమ సైడ్ నుంచి తప్పు జరిగిందన్నాడు గంభీర్. టీమ్‌లోని ఆటగాళ్లంతా చాలా ప్రొఫెషనల్ అని, గట్టిగా కమ్‌బ్యాక్ ఇస్తామన్నాడు. తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు హెడ్ కోచ్. ఆసీస్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని పేర్కొన్నాడు గంభీర్. ఒకవేళ రోహిత్ శర్మ గనుక పెర్త్ టెస్ట్‌కు దూరమైతే అతడి స్థానంలో కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్‌లో ఒకర్ని తీసుకుంటామని స్పష్టం చేశాడు గంభీర్. రాహుల్ ఓపెనింగ్ చేయగలడని, నంబర్ 3లో కూడా ఆడగలడని వ్యాఖ్యానించాడు. అవసరమైతే మిడిలార్డర్‌లోనూ అతడు బ్యాటింగ్ చేయగలడని.. ఇలాంటి ప్లేయర్లు చాలా అరుదు అని మెచ్చుకున్నాడు.


Also Read:

స్టార్టప్ దశ మార్చేసిన ధోని.. చిన్న సాయంతో వేల కోట్లు

రెండో టీ20లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు

మ్యాచ్ పోయినా సౌతాఫ్రికాను వణికించాడు.. కమ్‌బ్యాక్ అంటే ఇది

For More Sports And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 10:43 AM