Share News

Hardik Pandya: హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం.. ఆ వన్డే సిరీస్ నుంచి ఔట్?

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:00 PM

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అతను.. అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఆ వివరాలేంటంటే..

Hardik Pandya: హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం.. ఆ వన్డే సిరీస్ నుంచి ఔట్?
Hardik Pandya

టీ20 వరల్డ్‌కప్‌తో (T20 World Cup) పాటు జింబాబ్వే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు.. ఇప్పుడు శ్రీలంక టూర్‌కు సిద్ధమవుతోంది. ఆ జట్టు మూడేసి మ్యాచ్‌లు చొప్పున టీ20, వన్డే సిరీస్‌లు ఆడబోబోతోంది. తొలుత జులై 27వ తేదీ నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఇది ముగిసిన వెంటనే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ వన్డే సిరీస్‌కు టీ20 వరల్డ్‌కప్ విజేత హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అందుబాటులో ఉండడని సమాచారం. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.


ఈ విషయంపై బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘‘శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు విరామం తీసుకుంటున్నాడు. అంతే తప్ప.. ఫిట్నెస్ లోపాలేమీ లేవు’’ అని చెప్పారు. అయితే.. అంతకుముందు జరిగే టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులోనే ఉంటాడని, భారత జట్టుకి నాయకత్వం వహిస్తాడని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ‘‘రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 వైస్-కెప్టెన్‌గా పాండ్యా ఉన్నాడు. ఇప్పుడు శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో టీమిండియాకు నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు’’ అని చెప్పుకొచ్చారు. హార్దిక్ పాండ్యా చాలా ఫిట్‌గా ఉన్నాడని ఆ అధికారి మరోసారి ధృవీకరించారు.


ఈ నేపథ్యంలోనే.. వన్డే సిరీస్‌లో భారత జట్టుకి ఎవరు నాయకత్వం వహించనున్నారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా పాండ్యా సైతం విరామం కోరిన తరుణంలో.. వన్డే సిరీస్‌లో కెప్టెన్ ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే.. కేఎల్ రాహుల్ పేరు తెరమీదకి వచ్చింది. అతడు గతంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాబట్టి.. ఈ సిరీస్‌లోనూ అతనికే ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 03:00 PM