Share News

Champions Trophy 2025: పాక్ తోక కత్తిరించిన బీసీసీఐ.. ఏ మొహం పెట్టుకొని ఆడతారో..

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:25 PM

Champions Trophy 2025: ప్రతి దానికి ఓవరాక్షన్ చేసే పాకిస్థాన్‌కు మరోమారు బుద్ధి చెప్పింది బీసీసీఐ. దీంతో ఇక ఏ మొహం పెట్టుకొని ఆడతారని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

Champions Trophy 2025: పాక్ తోక కత్తిరించిన బీసీసీఐ.. ఏ మొహం పెట్టుకొని ఆడతారో..

వరల్డ్ క్రికెట్‌లో అంచనాలకు అందని జట్లలో పాకిస్థాన్ ఒకటి. ఎప్పుడు ఎలా ఆడుతోందో తెలియదు. చిన్న జట్లపై చిత్తుగా ఓడటం, బిగ్ టీమ్స్‌కు షాక్ ఇవ్వడం దాయాదులకే చెల్లింది. ఆటలోనే కాదు.. క్రికెట్ వ్యవహారాల్లోనూ పాక్ అన్‌ప్రెడిక్టబుల్ అనే చెప్పాలి. ఎప్పుడు ఏ సైడ్ తీసుకుంటుందో ఊహించలేం. ప్రతిదానికీ ఓవరాక్షన్ చేయడం, మొండికేయడం ఆ దేశ క్రికెట్ బోర్డుకు అలవాటుగా మారింది. అనవసరంగా భారత క్రికెట్ మీద ఏడవడం కూడా వాళ్లకు రివాజే. మన బోర్డును, టీమ్‌ను టార్గెట్ చేసుకొని ఎప్పటికప్పుడు సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది పీసీబీ. అయితే ఐసీసీలో ఉన్న పరపతితో దాన్ని అడ్డుకుంటూ వస్తోంది భారత క్రికెట్ బోర్డు. తాజాగా దాన్నే వాడుకొని మరోమారు పాక్ బోర్డు తోక కత్తిరించింది బీసీసీఐ.


ఐసీసీ సాయంతో చెక్

ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ విషయంలో పాక్ బోర్డు కుటిల యత్నాలకు బీసీసీఐ చెక్ పెట్టింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను నిర్వహించాలని పీసీబీ డిసైడ్ అయింది. నవంబర్ 16న ఇస్లామాబాద్ నుంచి ఈ టూర్ మొదలవనుంది. అయితే పీవోకేలోని స్కర్దు, హుంజా, ముజఫరాబాద్ ప్రాంతాలను కూడా షెడ్యూల్‌లో చేర్చింది పీసీబీ. ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ.. భారత్‌ను కవ్వించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని వెంటనే ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పీవోకేలో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను అత్యున్నత క్రికెట్ బోర్డు రద్దు చేసింది. షెడ్యూల్ నుంచి ఆ నాలుగు నగరాలను తొలగించింది.


మళ్లీ ఝలక్

పీసీబీ ప్రకటించిన ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను రద్దు చేసిన ఐసీసీ.. తాజా షెడ్యూల్‌ను వెలువరించింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొననున్న ఎనిమిది జట్ల దేశాల్లో ట్రోఫీని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టూర్ విషయంలో పాక్‌కు ఝలక్ ఇచ్చిన ఐసీసీ.. టోర్నీ షెడ్యూల్ విషయంలోనూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీల మధ్య టోర్నీని నిర్వహించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. లాహోర్, రావల్పిండి, కరాచీ వేదికగా మ్యాచులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇతర వేదికలకు ఛాన్స్ ఇవ్వాలని పాక్ కోరినా.. టాప్ క్రికెట్ బోర్డు ససేమిరా నో చెప్పిందట. ఇలా ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ రద్దుతో పాటు మ్యాచుల షెడ్యూల్ మార్పులతో పాక్ తన పరువు పోగొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీని గురించి తెలిసిన నెటిజన్స్.. భలేగా బుద్ధి చెప్పారని అంటున్నారు. ఇక ఏ మొహం పెట్టుకొని ఆడతారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కు వెళ్లేది లేదని ఐసీసీకి బీసీసీఐ తేల్చిచెప్పింది. హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని రిక్వెస్ట్ చేస్తోంది. దీనికి ఒప్పుకునేది లేదని పీసీబీ పట్టుదలగా ఉంది.


Also Read:

ఆసీస్ పొగరు అణిచేందుకు రాక్షసుడ్ని దింపుతున్న గంభీర్.. ఇక

తమిళ్‌ తలైవాస్‌ చేతిలో బెంగాల్‌ చిత్తు

మూడో స్థానంలో అర్జున్‌

For More Sports And Telugu News

Updated Date - Nov 17 , 2024 | 12:30 PM