Share News

ICC Awards 2023: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు

ABN , Publish Date - Jan 05 , 2024 | 08:56 PM

ICC Awards 2023: గత ఏడాదికి సంబంధించి ఐసీసీ అవార్డుల రేసులో టీమిండియా ఆటగాళ్లు దూసుకెళ్తున్నారు. తాజాగా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఉన్నారు.

ICC Awards 2023: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు

గత ఏడాదికి సంబంధించి ఐసీసీ అవార్డుల రేసులో టీమిండియా ఆటగాళ్లు దూసుకెళ్తున్నారు. తాజాగా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు అత్యధిక ఓట్లు పొందితే వారికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వస్తుంది. కోహ్లీ, జడేజా గత ఏడాది అన్ని ఫార్మాట్లలో రాణించడంతో ఐసీసీ అవార్డు రేసులో నిలిచారని.. కోహ్లీకి ఈ అవార్డు రావాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ రేసులో భారత్ నుంచి ఒకే ఒక్క ప్లేయర్ నిలిచాడు. టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్ ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచారు. అటు ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో మొత్తం నలుగురు ఆటగాళ్లు ఉండగా ఈ జాబితాలో ముగ్గురు భారత ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఐసీసీ ప్రకటించిన ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ షమీతో పాటు న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ ఉన్నారు. గత ఏడాది విరాట్ కోహ్లీ 27 వన్డేల్లో 1377 పరుగులు చేయగా శుభ్‌మన్ గిల్ 29 మ్యాచ్‌లలో 1584 పరుగులు, డారిల్ మిచెల్ 26 మ్యాచ్‌లలో 1204 పరుగులు చేశారు. ఇక మహ్మద్ షమీ 19 మ్యాచ్‌లలో 43 వికెట్లు పడగొట్టాడు. వన్డే ప్రపంచకప్‌లో అనూహ్య రీతిలో చెలరేగి భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంలో ముఖ్యపాత్ర పోషించాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 05 , 2024 | 08:59 PM