PCB vs ICC: పాకిస్థాన్‌కు ఐసీసీ అల్టిమేటం.. గట్టిగా బిగిస్తున్నారుగా
ABN , Publish Date - Nov 29 , 2024 | 09:53 PM
PCB vs ICC: ఐసీసీ దగ్గర తోకాడిస్తూ వస్తున్న పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ పడిందని తెలుస్తోంది. పాక్ క్రికెట్ బోర్డుకు అత్యున్నత క్రికెట్ బోర్డు డెడ్‌లైన్ పెట్టిందటని సమాచారం. ఈ వ్యవహారం గురించి పూర్తిగా తెలుసుకుందాం..
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఏదో ఒకటి తేల్చకుండా నాన్చుతూ వస్తోంది పాకిస్థాన్. టీమిండియా మ్యాచులను హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఒప్పుకోవడం లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎంత నచ్చజెప్పినా పీసీబీ వినడం లేదు. కొన్ని మ్యాచులను తరలించినా తమ నుంచి రావాల్సిన ఫండ్స్‌ను తగ్గించబోమని, అండగా ఉంటామని చెప్పినా పాక్ తోకాడిస్తోంది. భారత్‌కు కావాలనే అడ్డుపడుతోంది. టీమిండియా రాకపోతే ఐసీసీ టోర్నీల్లో ఇక మీదట ఆ జట్టుతో ఆడబోమంటూ హెచ్చరికలు పంపిస్తోంది. దీంతో ఐసీసీ సీరియస్ అయ్యింది. పీసీబీకి అత్యున్న క్రికెట్ బోర్డు అల్టిమేటం జారీ చేసిందని తెలుస్తోంది.
షరతులకు ఒప్పుకోవాల్సిందే!
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న పాక్ బోర్డుకు ఐసీసీ డెడ్‌లైన్ విధించిందని సమాచారం. తాము ఇచ్చే రెండు ఆప్షన్లలో ఏదో ఒక దానికి శనివారం లోపు ఒప్పుకోవాలని ఆదేశించిందట. భారత జట్టు ఆడే అన్ని మ్యాచులతో పాటు సెమీపైనల్, ఫైనల్ మ్యాచులను పాకిస్థాన్‌కు అవతల నిర్వహించడం అందులోని మొదటి ఆప్షన్ అని తెలుస్తోంది. దీనికి ఒప్పుకుంటే పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తారట. ఒకవేళ దీనికి ససేమిరా అంటే గనుక పాకిస్థాన్ నుంచి టోర్నీని ఇతర దేశానికి మార్చేస్తారట. ఇదే రెండో ఆప్షన్ అని క్రికెట్ వర్గాల సమాచారం.
పాక్ ఆడుతుందా? లేదా?
తాము పెట్టే షరతులకు ఒప్పుకుంటే టోర్నీ నిర్వహణకు ఓకే.. లేకపోతే ఇతర దేశానికి తరలిస్తామని పాక్ బోర్డుకు ఐసీసీ వార్నింగ్ ఇచ్చిందట. ఏదో ఒకటి 24 గంటల్లో క్లారిటీ ఇవ్వాలని ఆదేశించిందట. కాగా, పాకిస్థాన్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీని తరలించే నేపథ్యంలో ఆ టోర్నీలో దాయాది జట్టు పాల్గొనడం కూడా అనుమానంగా కనిపిస్తోంది. ఈ టోర్నీని తమ దేశం నుంచి తరలిస్తే అవమానించినట్లేనని.. తమ ప్లేయర్లు ఆడే ఛాన్స్ లేదని పలువురు పాక్ సీనియర్లు అంటున్నారు. అయితే ఐసీసీ స్పీడ్ చూస్తుంటే ఆదివారం లోపు మెగా టోర్నీ నిర్వహణపై ఏదో ఒకటి తేల్చేసేలా ఉంది. హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
Also Read:
పాకిస్థాన్‌కు ఐసీసీ అల్టిమేటం.. గట్టిగా బిగిస్తున్నారుగా
టీమిండియా కొత్త జెర్సీపై విమర్శలు.. బీసీసీఐ చేసిన తప్పేంటి..
పాపం.. 25 ఏళ్లకే కెరీర్ క్లోజ్
పంత్, అయ్యర్ కాదు.. ఐపీఎల్‌లో అత్యధిక ప్యాకేజ్ ఇతడికే..
For More Sports And Telugu News