Team India: టీమిండియా ప్రాక్టీస్‌లో గొడవ.. గిల్ ముందే కోచ్‌ల కొట్లాట
ABN , Publish Date - Nov 30 , 2024 | 09:49 PM
Team India: టీమిండియా మరో బిగ్ ఛాలెంజ్‌కు రెడీ అవుతోంది. పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. అడిలైడ్‌లోనూ విజయబావుటా ఎగురవేయాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి కంగారూలను కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని భావిస్తోంది.
IND vs AUS: టీమిండియా మరో బిగ్ ఛాలెంజ్‌కు రెడీ అవుతోంది. పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. అడిలైడ్‌లోనూ విజయబావుటా ఎగురవేయాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి కంగారూలను కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని భావిస్తోంది. అందుకోసం అవసరమైన అస్త్రాలను సిద్ధం చేస్తోంది. తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టుతో జాయిన్ అయ్యాడు. గాయంతో బాధపడుతున్న యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కోలుకున్నాడు. బరిలోకి దిగేందుకు అతడు ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే అతడి ముందే ఇద్దరు టీమిండియా కోచ్‌లు గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
త్రోలు విసురుతూ..
టీమిండియా ట్రెయినింగ్ క్యాంప్‌లో అలజడి రేగింది. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్‌లు ఢీ అంటే ఢీ అంటూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. పక్కనే గిల్ ఉన్నా పట్టించుకోకుండా గొడవకు దిగారు. అయితే అంత టెన్షన్ పడనక్కర్లేదు. ఇది సీరియస్ ఫైట్ కాదు. సరదాగా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్న టైమ్‌లో దిలీప్, నాయర్‌ల మధ్య ఫన్నీ ఫైట్ జరిగింది. స్టంప్స్‌ను పడేసేందుకు ఒకవైపు నాయర్, మరోవైపు గిల్ ప్రయత్నించారు. ఇద్దరూ పోటాపోటీగా త్రోలు విసిరారు. గిల్ ఒకసారి సక్సెస్ కాగా.. నాయర్ ఒక్కసారి కూడా వికెట్లను పడగొట్టలేకపోయాడు.
నవ్వులతో ముగిసింది
ప్రాక్టీస్ సమయంలో దిలీప్-నాయర్ సరదాగా ఒకరి మీదకు ఒకరు దూసుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ రనౌట్ ఛాలెంజ్ కంటిన్యూ చేశారు. ఆఖర్లో బంతులు విసిరేందుకు వచ్చిన దిలీప్ వికెట్లను గిరాటేశాడు. దీంతో నాయర్ వచ్చి అతడ్ని హగ్ చేసుకున్నాడు. అలా చిన్నపాటి ఫన్నీ ఫైట్‌తో స్టార్ట్ అయిన సెషన్ కాస్తా చివరకు కౌగిలించుకోవడం, నవ్వుల్లో మునగడంతో ముగిసింది. అయితే ఈ సమయంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్ దగ్గర్లో ఎక్కడా కనిపించలేదు. బహుశా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లాంటి వారితో వ్యూహాలు రచిస్తూ ఉన్నాడేమో. ఈ వీడియో చూసిన నెటిజన్స్ గంభీర్ లేని టైమ్‌లో ఫైట్ చేస్తున్నారా అంటూ సరదా కామెంట్స్ పెడుతున్నారు.
Also Read:
టీమిండియాకు పాకిస్థాన్ షాక్.. కుర్రాళ్లను నమ్మితే కొంపముంచారు
ఒక్క నోటు హార్దిక్ జీవితాన్ని మార్చేసింది.. రూ.400 నుంచి వందల కోట్లకు..
డౌటే లేదు.. కోహ్లీనే కెప్టెన్.. అశ్విన్ ఇలా అనేశాడేంటి
For More Sports And Telugu News