Share News

IND vs AUS: టీమిండియాలో సంచలన మార్పులు.. హింట్ ఇచ్చిన రోహిత్

ABN , Publish Date - Dec 12 , 2024 | 02:24 PM

గబ్బా సమరానికి సమయం దగ్గర పడుతోంది. మరో రెండ్రోజుల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా, పర్యాటక టీమిండియా ప్రఖ్యాత స్టేడియంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఒకరకంగా సిరీస్ డిసైడర్‌గా మారిన ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

IND vs AUS: టీమిండియాలో సంచలన మార్పులు.. హింట్ ఇచ్చిన రోహిత్
Team India

IND vs AUS: గబ్బా సమరానికి సమయం దగ్గర పడుతోంది. మరో రెండ్రోజుల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా, పర్యాటక టీమిండియా ప్రఖ్యాత స్టేడియంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఒకరకంగా సిరీస్ డిసైడర్‌గా మారిన ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. సిరీస్‌లో పోటీలో ఉండాలన్నా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకోవాలన్నా రోహిత్ సేన తప్పక నెగ్గాల్సిందే. ఇలా ఎన్నో రకాలుగా ఆసక్తిని సంతరించుకున్న ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో సంచలన మార్పులు చేయడం ఖాయమని తెలుస్తోంది.


వాళ్లిద్దరూ ఔట్!

రెండో టెస్టులో ఫెయిలైన యంగ్ పేసర్ హర్షిత్ రాణాను బెంచ్ మీద కూర్చోబెట్టడం పక్కా అని తెలుస్తోంది. వికెట్లు తీయకపోగా, ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో అతడ్ని తీసేసి ఆ స్థానంలో మరో సీమర్ ఆకాశ్‌దీప్‌ను రీప్లేస్ చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోందట. అడిలైడ్‌లో తుస్సుమన్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా బెంచ్‌కే పరిమితం చేయాలని రోహిత్-గంభీర్ డిసైడ్ అయ్యారట. అతడి ప్లేస్‌లో పెర్త్ టెస్ట్‌లో అదరగొట్టిన యంగ్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించారని వినిపిస్తోంది.


రోహిత్ పైకి.. రాహుల్ కిందకు..

బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ సంచలన మార్పులు చేసేందుకు రోహిత్-గౌతీ ద్వయం సిద్ధమవుతోందని తెలిసింది. తన ఒరిజినల్ పొజిషన్ ఓఫెనింగ్‌కు హిట్‌మ్యాన్ షిఫ్ట్ అవడం ఖాయమని సమాచారం. నెట్ సెషన్‌లో రోహిత్ కొత్త బంతితో ప్రాక్టీస్ చేయడం ద్వారా దీనిపై హింట్ కూడా ఇచ్చేశాడు. కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లోకి పంపి, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఒక స్థానం మీదకు ఆడించాలని భావిస్తున్నారట. మొదట్రెండు టెస్టుల్లో దుమ్మురేపిన తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డికి బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోందట. రిషబ్ పంత్ కంటే ముందే అతడ్ని పంపేలా ప్లాన్ చేస్తోందట. ప్లేయింగ్ ఎలెవన్‌తో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ ఛేంజెస్ చేయడం జట్టుకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.


Also Read:

ఆసీస్ కాదు.. ఆ ఒక్కడికి భయపడుతున్న భారత్.. గబ్బాకు వస్తున్నాడు

43వ పడిలోకి యువరాజ్.. డాషింగ్ ఆల్‌రౌండర్ లైఫ్‌లోని 7 డార్క్ సీక్రెట్స్
దిగజారిన కోహ్లీ, రోహిత్‌ ర్యాంకులు

గాయత్రి జోడీకి నిరాశ

టీఓఏ పీఠంపై జితేందర్‌
For More
Sports And Telugu News

Updated Date - Dec 12 , 2024 | 02:27 PM