Rohit Sharma: అడిలైడ్‌లో ఘోర ఓటమి.. అతడి కోసం వెయిటింగ్ అంటున్న రోహిత్
ABN , Publish Date - Dec 08 , 2024 | 03:44 PM
Rohit Sharma: పింక్ బాల్ టెస్ట్ ఓటమి అటు అభిమానులతో పాటు ఇటు భారత జట్టు ఆటగాళ్లను కూడా నిరాశలోకి నెట్టేసింది. పెర్త్ టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన వారానికే ఇంత దారుణంగా ఓడతారని ఎవరూ ఊహించలేదు.
IND vs AUS: పింక్ బాల్ టెస్ట్ ఓటమి అటు అభిమానులతో పాటు ఇటు భారత జట్టు ఆటగాళ్లను కూడా నిరాశలోకి నెట్టేసింది. పెర్త్ టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన వారానికే ఇంత దారుణంగా ఓడతారని ఎవరూ ఊహించలేదు. దాదాపుగా రెండ్రోజుల్లోనే ముగిసిన ఈ టెస్ట్‌లో రోహిత్ సేన అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. కెప్టెన్ హిట్‌మ్యాన్ సహా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తీవ్రంగా నిరాశపర్చారు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఫర్వాలేదనిపించినా రిజల్ట్‌ను మార్చే రీతిలో పెర్ఫార్మ్ చేయలేకపోయారు. దీంతో ఆ ఒక్కడి మీదే ఆశలు పెట్టుకున్నాడు రోహిత్.
ఎప్పుడొచ్చినా ఓకే
పింక్ బాల్ టెస్ట్ ఓటమితో బ్రిస్బేన్‌లో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నాడు రోహిత్. అందుకోసం ఓ పేస్ పిచ్చోడి మీద ఆశలు పెట్టుకున్నాడు. అతడు మరెవరో కాదు.. సీనియర్ స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లకు పోయించే షమి.. ఆసీస్ ఫ్లైట్ ఎక్కడం దాదాపుగా ఖాయమైంది. ఈ విషయంపై రోహిత్ రియాక్ట్ అయ్యాడు. అతడి రాక కోసం ఎదురు చూస్తున్నామని అన్నాడు. షమి కోసం భారత జట్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నాడు. అలాగని అతడి మీద అదనపు ఒత్తిడి పెట్టబోమన్నాడు హిట్‌మ్యాన్.
మూకుమ్మడి వైఫల్యం
‘షమి కోసం టీమ్ తలుపులు తెరిచే ఉంటాయి. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ సమయంలో అతడి మోకాలు మళ్లీ వాచింది. దీంతో టెస్ట్ మ్యాచులకు కావాల్సిన సంసిద్ధత మీద దెబ్బ పడినట్లయింది. చాన్నాళ్లుగా షమి గేమ్‌కు దూరంగా ఉంటున్నాడు. అతడి మీద ప్రెజర్ పెట్టడం కరెక్ట్ కాదు. సీనియర్ పేసర్ విషయంలో మేం చాలా అప్రమత్తంగా ఉంటాం’ అని రోహిత్ స్పష్టం చేశాడు. అడిలైడ్ టెస్ట్ ఓటమికి ఏ ఒక్కర్నో బాధ్యుల్ని చేయడం లేదని.. జట్టు ఆటగాళ్లంతా మూకుమ్మడిగా విఫలమయ్యామని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు ఫెయిల్ అవడంతో దారుణ ఓటమి తప్పలేదన్నాడు. తమ కంటే కంగారూ టీమ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందన్నాడు హిట్‌మ్యాన్.