Rohit Sharma: రోహిత్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన స్టీవ్ స్మిత్
ABN , Publish Date - Dec 15 , 2024 | 12:50 PM
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌లో తడాఖా చూపించాడు. కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ పట్టుకొని అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. అతడి క్యాచ్ చూసి ప్రత్యర్థి బ్యాటర్ షాక్ అయ్యాడు.
IND vs AUS: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటే అటాకింగ్ బ్యాటింగ్, వండర్‌ఫుల్ కెప్టెన్సీ మాత్రమే గుర్తుకొస్తాయి. గ్రౌండ్‌లోకి దిగితే బ్యాట్‌తో బీభత్సం చేసే హిట్‌మ్యాన్.. సారథ్యంలోనూ తన మార్క్‌తో టీమ్‌కు విజయాలు అందిస్తుంటాడు. అయితే అతడు ఒకప్పుడు తోపు ఫీల్డర్ అనే విషయం చాలా మందికి తెలియదు. భారత జట్టులోకి వచ్చిన కొత్తలో కళ్లుచెదిరే ఫీల్డింగ్‌తో అందర్నీ షాక్‌కు గురిచేసేవాడు హిట్‌మ్యాన్. ఆ తర్వాత కాలంలో గాయాలు, ఫిట్‌నెస్ ఇష్యూస్, అధిక బరువు తదితర కారణాల వల్ల ఫీల్డింగ్ స్టాండర్స్‌లో కాస్త తగ్గాడు. అయితే తనలో పస ఇంకా తగ్గలేదని అతడు తాజాగా ప్రూవ్ చేశాడు.
వాటే క్యాచ్
ఆస్ట్రేలియాతో ప్రఖ్యాత గబ్బా స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కంగారూ సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (101) ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో ఉన్న హిట్‌మ్యాన్ కుడి చేతి వైపు డైవ్ చేసి అందుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఆఫ్ సైడ్‌లో పడిన ఊరించే డెలివరీని షాట్ ఆడబోయి సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. అంతే రివ్వున దూసుకొచ్చిన బంతిని అమాంతం దూకి అందుకున్నాడు రోహిత్. హిట్‌మ్యాన్ డైవ్ చేయడం, బంతిని ఒడిసిపట్టుకోవడం చూసి స్మిత్ షాక్ అయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ ప్రస్తుతం 6 వికెట్లకు 354 పరుగులతో ఉంది.
Also Read:
గబ్బాలో సచిన్ కూతురు.. అతడి కోసం స్పెషల్‌గా..
ఆ గొడవ మర్చిపోని సిరాజ్
బుమ్రాను భయపెట్టిన హెడ్
లబుషేన్‌ను వణికించిన తెలుగోడు
For More Sports And Telugu News