Share News

IND vs ENG: టీమిండియా ఆలౌట్.. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఇంగ్లండ్ ఎన్ని రన్స్ చేయాలంటే..

ABN , Publish Date - Mar 09 , 2024 | 10:25 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగుల భారీ స్కోర్ వద్ద రోహిత్ సేన ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియాకు 259 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

IND vs ENG: టీమిండియా ఆలౌట్.. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఇంగ్లండ్ ఎన్ని రన్స్ చేయాలంటే..

ధర్మశాల: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగుల భారీ స్కోర్ వద్ద రోహిత్ సేన ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియాకు 259 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే 260 పరుగులు చేయాలి. 473/8 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 4 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్(30)ను జేమ్స్ అండర్సన్, జస్ప్రీత్ బుమ్రా(20)ను షోయబ్ బషీర్ పెవిలియన్ చేర్చారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుభ్‌మాన్ గిల్(110) సెంచరీలతో చెలరేగారు. దేవదత్ పడిక్కల్(65), యశస్వీ జైస్వాల్ (57), సర్ఫరాజ్ ఖాన్ (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లతో సత్తా చాటాడు. టామ్ హార్ట్‌లీ, జేమ్స్ అండర్సన్ రెండేసి వికెట్లు.. స్టోక్స్ ఒక వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 218 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆ జట్టు ఓపెనర్ జాక్ క్రాలే(79) మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5, అశ్విన్ 4 వికెట్లతో సత్తా చాటగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Viral Video: ఇలాంటి క్యాచ్ నబూతో.. నభవష్యతి.. మీరు క్రికెట్ ఫ్యాన్స్ అయితే కచ్చితంగా చూడాల్సిందే..

IND vs ENG: ఐదో టెస్టులో టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు



Updated Date - Mar 09 , 2024 | 10:38 AM