Nitish Kumar Reddy: సన్‌రైజర్స్‌పై నితీష్ ఎమోషనల్ కామెంట్స్.. మళ్లీ మనసులు గెలిచేశాడు
ABN , Publish Date - Dec 01 , 2024 | 10:02 PM
Nitish Kumar Reddy: టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మంచి ఊపు మీద ఉన్నాడు. తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తుపై భరోసా ఇస్తున్నాడు.
IND vs PM 11: టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మంచి ఊపు మీద ఉన్నాడు. తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తుపై భరోసా ఇస్తున్నాడు. భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో అతడు మరింత రాణిస్తే టెస్ట్ టీమ్‌లో పర్మినెంట్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు నితీష్ అందరికీ తెలుసు. మంచి ఫేమ్, క్రేజ్ సంపాదించాడు. అతడే భారత భవిష్యత్ అంటూ మెచ్చుకుంటున్నారు. కానీ ఒక టైమ్‌లో అతడి గురించి ఎవరికీ తెలియదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇచ్చిన ప్రోత్సాహం, అవకాశాలు నితీష్‌ను ఈ స్థాయికి చేర్చాయి. అందుకే ఆ జట్టు తనకు ఎంతో స్పెషల్ అంటున్నాడీ తెలుగోడు.
ఆ కారణంతోనే..
ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌లో చాలా మంది స్టార్లు పాల్గొన్నారు. రిషబ్ నుంచి అర్ష్‌దీప్ సింగ్ వరకు టీమిండియా ప్లేయర్లు వేలం బరిలో నిలిచి.. భారీ ధరకు అమ్ముడుబోయారు. అయితే నితీష్ మాత్రం ఆక్షన్‌లోకి రాలేదు. సన్‌రైజర్స్ జట్టునే అతడు అట్టిపెట్టుకొని ఉండిపోయాడు. దీంతో నితీష్‌పై విమర్శలు వచ్చాయి. అతడు ఆక్షన్‌లోకి వచ్చి ఉంటే ఊహించని ధర దక్కేదని అభిప్రాయాలు వినిపించాయి. దీనిపై తాజాగా నితీష్ రియాక్ట్ అయ్యాడు. సన్‌రైజర్స్ తనకు ఎంతో ఇచ్చిందని.. ఆ జట్టులో ఆడటం ద్వారా వచ్చిన గుర్తింపు వల్లే టీమిండియాలోకి రాగలిగానని చెప్పాడు.
అందుకే వదల్లేదు
‘నేను తొలుత సన్‌రైజర్స్‌కు ఆడా. దాని వల్లే ఇప్పుడు టీమిండియాకు ఆడుతున్నా. డబ్బులు పెద్ద మ్యాటర్ కాదు. బాగా ఆడితే మనీ ఎప్పుడైనా వస్తుంది. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున నేను బరిలోకి దిగి ఆడుతుంటే తెలుగు వాళ్లంతా ఎంతో గర్విస్తారు. అదే వేరే ఫ్రాంచైజీకి ఆడితే మన అనే ఫీల్ రాదు’ అని నితీష్ చెప్పుకొచ్చాడు. ఎస్‌ఆర్‌హెచ్ తనకు లైఫ్ ఇచ్చిందని.. అందుకే ఆ జట్టును వదల్లేదన్నారు. కాగా, వేలానికి ముందు రూ.6 కోట్లకు నితీష్‌ను సన్‌రైజర్స్ రీటెయిన్ చేసుకుంది.
కంగారూలను వణికిస్తున్నాడు
ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగు పెట్టినప్పటి నుంచి నితీష్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. పెర్త్ టెస్ట్‌లో అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో రాణించి జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆదివారం ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రాణించాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో 42 పరుగులు చేశాడు. బౌండరీలు, సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడు. ఇదే జోరును అడిలైడ్ టెస్ట్‌లోనూ కొనసాగించాలని భావిస్తున్నాడు.
Also Read:
కొడుకుకు నామకరణం చేసిన రోహిత్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
గిల్ రాకతో ఆ ఇద్దరు అవుట్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండేది వీరే..
ఐపీఎల్‌లో అమ్ముడుపోలేదు.. వదిలేసిన జట్లకు అలా బుద్ధిచెప్పారు..
For Sports And Telugu News