Share News

Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడేసిన నితీష్.. ఇదీ తెలుగోడి పవర్

ABN , Publish Date - Dec 01 , 2024 | 06:17 PM

Nitish Kumar Reddy: టీమిండియా యువ కెరటం నితీష్ కుమార్ రెడ్డి మరోమారు సత్తా చాటాడు. తన బ్యాట్ పవర్ ఏంటో అందరికీ ఇంకోసారి రుచి చూపించాడు. ఏదైనా తాను దిగనంత వరకే అని ప్రూవ్ చేశాడు.

Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడేసిన నితీష్.. ఇదీ తెలుగోడి పవర్

IND vs PM 11: టీమిండియా యువ కెరటం నితీష్ కుమార్ రెడ్డి మరోమారు సత్తా చాటాడు. తన బ్యాట్ పవర్ ఏంటో అందరికీ ఇంకోసారి రుచి చూపించాడు. ఏదైనా తాను దిగనంత వరకే అని ప్రూవ్ చేశాడు. తాను అడుగు పెడితే మ్యాచ్ ఫినిష్ చేయకుండా వదలనని నిరూపించాడు. పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా పని పట్టిన ఈ తెలుగోడు.. ఇవాళ కూడా వాళ్లను వణికించాడు. సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌లాగే కంగారూలకు కొరకరాని కొయ్యగా మారాడు. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది.


టార్గెట్ చేసుకొని..

ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో నితీష్ క్వాలిటీ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 32 బంతుల్లో 5 బౌండరీలు, ఒక సిక్స్ సాయంతో 42 పరుగులు చేశాడీ తెలుగోడు. లెగ్ స్పిన్నర్ లాయిడ్ పోప్ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు నితీష్. స్ట్రయిట్ ఓ ఫోర్ కొట్టిన యంగ్ బ్యాటర్.. లెగ్ సైడ్ ఇంకో బౌండరీ బాదాడు. అలాగే రివర్స్ స్వీప్‌తో మరో నాలుగు పరుగులు రాబట్టాడు. పేసర్లను కూడా వదల్లేదు. మంచి బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతుల్ని శిక్షించాడు నితీష్.


ప్రాక్టీస్ అదిరెన్

పోప్‌ను ఉతికి ఆరేసిన నితీష్.. అతడి బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. అయితే అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ చేసేశాడు. ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాక్కెళ్లిపోయాడు. నితీష్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ (42 నాటౌట్), శుబ్‌మన్ గిల్ (50 రిటైర్డ్ నాటౌట్), యశస్వి జైస్వాల్ (45) విజృంభించడంతో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ సంధించిన 240 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ఛేజ్ చేసేసింది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తా చాటడం, బ్యాటింగ్‌లో గిల్ హాఫ్ సెంచరీ బాదడం.. నితీష్-సుందర్ సూపర్బ్ నాక్స్‌ ఆడటం ఈ మ్యాచ్‌లో భారత్‌కు సానుకూలాంశాలుగా చెప్పాలి. మొత్తంగా పింక్ టెస్ట్‌కు ముందు రోహిత్ సేనకు మంచి ప్రాక్టీస్ దొరికిందని భావించాలి.


Also Read:

జైస్వాల్‌ను భయపెట్టిన బచ్చా బౌలర్.. బుల్లెట్ డెలివరీస్‌తో షేక్ చేశాడు

టీమ్ కోసం భారీ త్యాగం.. కెప్టెన్‌ అంటే రోహిత్‌లా ఉండాలి

ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు.. ఈ 5 సవాళ్లను దాటితేనే కింగ్ అనిపించుకునేది

For Sports And Telugu News

Updated Date - Dec 01 , 2024 | 06:46 PM