Share News

IND vs SA: చరిత్ర సృష్టించిన టీమిండియా.. తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే..

ABN , Publish Date - Jan 03 , 2024 | 05:42 PM

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(15/6) తన కెరీర్ అత్యుతమ ప్రదర్శనతో చెలరేగడంతో రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అతిథ్య సౌతాఫ్రికా జట్టు 55 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ ఆరంభం నుంచి నిప్పులు చిమ్మిన సిరాజ్ బలమైన సౌతాఫ్రికా టాపార్డర్‌ను ఒంటి చేతితో పెవిలియన్ చేర్చాడు.

IND vs SA: చరిత్ర సృష్టించిన టీమిండియా.. తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే..

కేప్‌టౌన్: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(15/6) తన కెరీర్ అత్యుతమ ప్రదర్శనతో చెలరేగడంతో రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అతిథ్య సౌతాఫ్రికా జట్టు 55 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ ఆరంభం నుంచి నిప్పులు చిమ్మిన సిరాజ్ బలమైన సౌతాఫ్రికా టాపార్డర్‌ను ఒంటి చేతితో పెవిలియన్ చేర్చాడు. సిరాజ్‌కు పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా, యువ పేసర్ ముఖేష్ కుమార్ కూడా సహకరించడంతో సఫారీ బ్యాటర్లు బెంబెలెత్తిపోయారు. టాపార్డర్‌ను సిరాజ్ చూసుకుంటే ముఖేష్ కుమార్, బుమ్రా లోయర్ ఆర్డర్ భరతం పట్టారు. ఏ బ్యాటర్ కూడా ఎక్కవు సేపు క్రీజులో నిలవలేకపోయాడు. సఫారీ జట్టులో ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 23.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన సఫారీలు తొలి రోజు ఆటలో తొలి సెషన్‌లోనే ఆలౌట్ అయ్యారు. టీం మొత్తం కలిసి 55 పరుగులే చేయగల్గింది. సౌతాఫ్రికా 10 వికెట్లను టీమిండియా పేసర్లే కూల్చారు. భారత బౌలర్లలో సిరాజ్ 6 వికెట్లతో విశ్వరూపం చూపించాడు. ముఖేష్ కుమార్ 2, బుమ్రా ఒక వికెట్ తీశారు.


ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో టీమిండియా చరిత్రాత్మక రికార్డును ఖాతాలో వేసుకుంది. తమ టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రత్యర్థిని ఓ ఇన్నింగ్స్‌లో అత్యంత తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసింది. భారత జట్టు ప్రత్యర్థిని కట్టడి చేసిన అత్కంత తక్కువ స్కోర్ ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్ ముందువరకు 2021లో వాంఖడే టెస్టులో న్యూజిలాండ్‌ను 62 పరుగులకే ఆలౌట్ చేసిన రికార్డు మొదటి స్థానంలో ఉండేది. తాజా రికార్డు దానిని అధిగమించింది. అలాగే సౌతాఫ్రికా జట్టు క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత అత్యల్ప స్కోర్ కూడా ఇదే. దీంతో తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో సౌతాఫ్రికా జట్టు అత్యల్ప స్కోర్‌కు ఆలౌట్ అయింది. తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసిన సౌతాఫ్రికా జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. అలాగే ఈ మ్యాచ్ ముందు వరకు 2018లో గాలె టెస్టులో శ్రీలంక చేతిలో 73 పరుగులకు ఆలౌటైన రికార్డు ముందుండేది. తాజాగా ఆ చెత్త రికార్డును ఇది అధిగమించింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 15 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లీ(8) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయినప్పటికీ, ధాటిగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ 39 పరుగులు చేశాడు.

Updated Date - Jan 03 , 2024 | 05:42 PM