Share News

IND vs SA: శ్రీరాముడిలా బాణం ఎక్కుపెట్టిన విరాట్ కోహ్లీ.. మీరు ఓ లుక్కేయండి..

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:07 PM

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగానే మైదానంలో యాక్టివ్‌గా కనిపించే విరాట్ కోహ్లీ శ్రీరాముడిలా విల్లు ఎక్కుపెడుతున్నట్టుగా చేశాడు. అంతేకాకుండా తర్వాత నమస్కరించాడు.

IND vs SA: శ్రీరాముడిలా బాణం ఎక్కుపెట్టిన విరాట్ కోహ్లీ.. మీరు ఓ లుక్కేయండి..

కేప్‌టౌన్: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగానే మైదానంలో యాక్టివ్‌గా కనిపించే విరాట్ కోహ్లీ శ్రీరాముడిలా విల్లు ఎక్కుపెడుతున్నట్టుగా చేశాడు. అంతేకాకుండా తర్వాత నమస్కరించాడు. మహ్మద్ సిరాజ్ వేసిన 16వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఓవర్లో సౌతాఫ్రికా బ్యాటర్ మార్కో జాన్‌సెన్‌ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 34 పరుగులకే సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి బ్యాటర్ కేశవ్ మహారాజ్ మైదానంలోకి వచ్చాడు. ఈ గ్యాప్‌లో స్టేడియం నిర్వహకులు ఆదిపురుష్ చిత్రంలోని ‘‘రామ్ సియా రామ్’’ పాటను ప్లే చేశారు. ఆ లిరిక్స్ విన్న విరాట్ కోహ్లీ శ్రీరాముడిని అనుకరించాడు. బాణం ఎక్కుపెట్టి విల్లును వదులుతున్నట్టుగా చేశాడు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడికి నమస్కరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విరాట్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. క్రీజులో మాక్రమ్(36), డేవిడ్ బెడింగ్‌హామ్(7) ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా ఇంకా 36 పరుగులు వెనుకబడింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు కీలకమైన 98 పరుగుల అధిక్యం లభించింది. తొలి రోజు ఆటలోనే ఏకంగా 23 వికెట్లు నేలకూలడం గమనార్హం. మొత్తంగా 75.1 ఓవర్లపాటు సాగిన తొలి రోజు ఆటలో 270 పరుగులు రాగా.. ఏకంగా 23 వికెట్ల పడ్డాయి. ఇందులో ఒక రనౌట్ మినహా 22 వికెట్లు బౌలర్లే తీశారు. పడిన వికెట్లన్నీ పేసర్లకే దక్కాయి. రెండు జట్లలో స్పిన్నర్లకు అసలు బౌలింగ్ చేసే అవకాశమే దక్కలేదు.

Updated Date - Jan 03 , 2024 | 10:11 PM