IND vs ENG: కోహ్లీ, శ్రేయాస్ ఔట్.. మిగతా 3 టెస్టులకు టీమిండియా ఎంపిక
ABN , Publish Date - Feb 10 , 2024 | 11:34 AM
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత జట్టును ప్రకటించింది. ముందుగా వచ్చిన వార్తా కథనాలను నిజం చేస్తూ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మిగిలిన మూడు టెస్టులకు కూడా దూరమయ్యాడు.
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత జట్టును ప్రకటించింది. ముందుగా వచ్చిన వార్తా కథనాలను నిజం చేస్తూ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మిగిలిన మూడు టెస్టులకు కూడా దూరమయ్యాడు. సిరీస్‌లోని మొదటి రెండు టెస్టులకు కూడా కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. తన 13 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఓ సిరీస్ మొత్తానికి దూరం కావడం విరాట్ కోహ్లీకి ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొంతకాలంగా ఫేలవ ఫామ్‌తో సతమతమవుతున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌పై వేటు పడింది. దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమైన శ్రేయాస్.. తొలి రెండు టెస్టుల్లోనూ రాణించలేకపోయాడు. 26 సగటుతో 104 పరుగులు మాత్రమే చేశాడు. ఫేలవ ఫామ్‌కు తోడు శ్రేయాస్ అయ్యర్‌కు గాయం కూడా అయినట్టు సమాచారం. ఇక గాయాల కారణంగా వైజాగ్ టెస్టుకు దూరమైన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వీరిద్దరు మూడో టెస్టులో బరిలోకి దిగుతారా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది. పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే ఆడొచ్చు.
అలాగే సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తొలి రెండు టెస్టులకు స్క్వాడ్‌లో ఉన్న లెఫార్ట్ స్పిన్నర్ సౌరభ్ కుమార్‌ను జట్టు నుంచి విడుదల చేశారు. అతని స్థానంలో మీడియం పేస్ ఆల్ రౌండర్ ఆకాష్ దీప్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక మిగతా జట్టు అంతా యథావిధిగా కొనసాగనుంది. యువ ఆటగాళ్లు రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ కూడా జట్టులో కొనసాగనున్నారు. మొత్తంగా మిగిలిన 3 టెస్టులకు 17 మందితో కూడిన భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. కాగా భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ , కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.