IND vs AUS: ఆసీస్‌తో టీమిండియా ఫైట్.. ఫ్రీగా స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:13 PM
IND vs AUS: టెస్ట్ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకంగా మారిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. సమవుజ్జీల్లాంటి భారత్-ఆస్ట్రేలియా మధ్య భీకర పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచుల్ని ఎక్కడ చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
BGT 2024: టెస్ట్ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకంగా మారిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. సమవుజ్జీల్లాంటి భారత్-ఆస్ట్రేలియా మధ్య భీకర పోరుకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 22వ తేదీ నుంచి ఈ రెండు జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఐదు మ్యాచుల ఈ సుదీర్ఘ సిరీస్ కోసం భారత్-ఆసీస్ అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే సిరీస్ గెలుపు కీలకం కావడంతో రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇలా పలు కారణాలతో ఫుల్ ఎగ్జయిట్‌మెంట్‌ను క్రియేట్ చేసిన ఈ సిరీస్ మ్యాచుల్ని ఎక్కడ చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక్కో మ్యాచ్ ఒక్కో టైమ్‌కు..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మ్యాచుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో స్ట్రీమింగ్ చేయొచ్చు. టీవీ లైవ్ కావాలంటే డీడీ స్పోర్ట్స్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్‌లో చూడొచ్చు. ఈ సిరీస్‌లోని ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో టైమ్ షెడ్యూల్ ఉంది. పెర్త్ ఆతిథ్యం ఇస్తున్న మొదటి టెస్ట్ ఉదయం 7.50 గంటలకు ప్రారంభం అవుతుంది. అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్ట్ పొద్దున 9.30కు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత జరిగే బ్రిస్బేన్ టెస్ట్ ఉదయం 5.50 గంటలకు, మెల్‌బోర్న్ టెస్ట్ పొద్దున 5 గంటలకు షురూ అవుతాయి. సిడ్నీ హోస్ట్‌గా ఉన్న చివరి టెస్ట్ ఉదయం 5 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్ జనవరి 3వ తేదీన మొదలవనుంది.
బలమైన జట్లతో బరిలోకి..
ఈ సిరీస్‌కు అటు ఆసీస్, ఇటు భారత్ స్ట్రాంగ్ స్క్వాడ్స్‌తో బరిలోకి దిగుతున్నాయి. టీమిండియాలో ఒక్క సారథి రోహిత్ తప్ప అందరూ అందుబాటులో ఉన్నారు. ఇరు జట్లలో ఏయే ఆటగాళ్లు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్.
ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), జోష్ హేజల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచ్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.
Also Read:
భారత్‌ను భయపెడుతున్న కోహ్లీ.. ఫామ్ కాదు, సాలిడ్ రీజన్ ఉంది
దడ పుట్టించావు కదయ్యా.. షాకిచ్చిన కోహ్లీ సోషల్ మీడియా పోస్టు
బిడ్డ పుట్టేసినా మ్యాచ్‌కు రానంటే ఎలా..
For More Sports And Telugu News