IND vs AUS: 72 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. పెర్త్ టెస్ట్‌లో అరుదైన రికార్డు
ABN , Publish Date - Nov 22 , 2024 | 06:50 PM
IND vs AUS: పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు పట్టిస్తోంది టీమిండియా. తమను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్న సంతోషంలో ఉన్న కంగారూలకు బుమ్రా సేన మూడు చెరువుల నీళ్లు తాగించింది.
పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు పట్టిస్తోంది టీమిండియా. తమను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్న సంతోషంలో ఉన్న కంగారూలకు బుమ్రా సేన మూడు చెరువుల నీళ్లు తాగించింది. పదునైన పేస్ బౌలింగ్‌తో ఆసీస్ బెండు తీసింది. బాల్‌ను టచ్ చేయాలన్నా భయపడేలా చేసింది. ఆడుతోంది కంగారూ గడ్డ మీదనా లేదా భారత గడ్డ మీదనా అనేంతలా మనోళ్లు చెలరేగారు. ఫస్ట్ డే డామినేషన్ చూపించిన మెన్ ఇన్ బ్లూ.. ఓ అరుదైన రికార్డులో పాలుపంచుకుంది. ఇలా జరగడం 72 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఏంటా రికార్డు? అనేది ఇప్పుడు చూద్దాం..
ఒక్కరోజే అన్ని వికెట్లా?
పెర్త్ టెస్ట్‌లో తొలి రోజు ఏకంగా 17 వికెట్లు నేలకూలాయి. మొదటి రోజు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆసీస్ డే1 ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఒక్కరోజే పదిహేడు వికెట్లు పడ్డాయి. ఆసీస్ గడ్డపై 1952 తర్వాత టెస్టుల్లో మొదటి రోజు ఇన్ని వికెట్లు కూలడం ఇదే ఫస్ట్ టైమ్. దీంతో అరుదైన రికార్డులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో పాటు బుమ్రా సేన కూడా భాగస్వామ్యం అయింది. పేస్, బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్ మీద కంగారూ బౌలర్లు ఎంతగా విజృంభించారో అంతకు డబుల్ మనోళ్లు చెలరేగారు.
పరుగు తీయాలంటే వణికేలా..
కంగారూ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మరో పేసర్ జోష్ హేజల్‌వుడ్ 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఇంక భారత బౌలర్లలో సారథి బుమ్రా 4 వికెట్లతో దుమ్మురేపాడు. ఆసీస్ బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. అతడితో పాటు మహ్మద్ సిరాజ్ (2/17), అరంగేట్ర సీమర్ హర్షిత్ రాణా (1/33) కూడా విజృంభించి బౌలింగ్ చేశారు. తమను తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఓవరాక్షన్ చేసిన కంగారూల మెడలు వంచాడు బుమ్రా. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులను వణికించాడు. సిరాజ్ కూడా అదరగొట్టాడు. వరుస మెయిడిన్లు వేసి పరుగు తీయాలంటే భయపడేలా చేశాడు. బ్యాక్ టు బ్యాక్ వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
Also Read:
ఆసీస్ బెండు తీసిన తెలుగోడు.. చేజారిన మ్యాచ్‌ను నిలబెట్టాడు
టీమిండియాను రెచ్చగొట్టిన లబుషేన్.. మళ్లీ నోరెత్తకుండా
వరల్డ్ కప్ హీరోను వణికించిన హర్షిత్ రాణా.. ఏం బౌలింగ్ భయ్యా
For More Sports And Telugu News