Shweta Sehrawat: 31 ఫోర్లు, 7 సిక్సులు.. వన్డేలో డబుల్ సెంచరీతో టీమిండియా క్రికెటర్ విశ్వరూపం
ABN , Publish Date - Jan 07 , 2024 | 01:14 PM
బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో ఢిల్లీ యువ ప్లేయర్ శ్వేతా సెహ్రావత్ విశ్వరూపం చూపించింది. 31 ఫోర్లు, 7 సిక్సులతో ఊచకోత కోసిన శ్వేతా సెహ్రావత్ డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించింది. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల ఈ యువ సంచలనం ఆకాశమే హద్దుగా చెలరేగింది.
రాంచీ: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో ఢిల్లీ యువ ప్లేయర్ శ్వేతా సెహ్రావత్ విశ్వరూపం చూపించింది. 31 ఫోర్లు, 7 సిక్సులతో ఊచకోత కోసిన శ్వేతా సెహ్రావత్ డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించింది. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల ఈ యువ సంచలనం ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఫోర్లు, సిక్సులను బఠాణీలు తిన్నంతా సునాయసంగా బాదేసింది. బంతిని వీర బాదుడు బాదిన శ్వేతా పరుగుల వరద పారించింది. ఈ పెను విధ్వంసంలో భాగంగా 150 బంతులు మాత్రమే ఎదుర్కొని 242 పరుగులు చేసింది. శ్వేతా సెహ్రావత్ విధ్వంసానికి తోడు ప్రతీక సెంచరీతో చెలరేగింది. 89 బంతుల్లో 101 పరుగులు బాదింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఢిల్లీ జట్టు 4 వికెట్ల నష్టానికి 455 పరుగుల కొండంత స్కోర్ సాధించింది.
అనంతరం 456 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నాగాలాండ్ జట్టు ఢిల్లీ బౌలర్ల ధాటికి 24.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 55 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఉమెన్స్ జట్టు ఏకంగా 400 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కాగా 19 ఏళ్ల శ్వేతా సెహ్రావత్ దేశాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రస్తుతం టీమిండియా అండర్ 19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఉంది. మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో శ్వేతా సెహ్రావత్ కీలక పాత్ర పోషించింది. ఆ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచింది. రానున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో ఈ యువ సంచలనం యూపీ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. కాగా వేలంలో శ్వేతా సెహ్రావత్‌ను యూపీ రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది.