Share News

IPL 2024లో వ్యాఖ్యాతలు వీళ్లే.. తెలుగులో ఎవరెవరంటే..

ABN , Publish Date - Mar 20 , 2024 | 02:40 PM

టాటా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 కోసం జియో సినిమా త‌న ప్యానెల్ ఎక్స్‌ప‌ర్ట్ బృందం(వ్యాఖ్యాతలు)లోని పేర్లను విడుద‌ల చేసింది.

IPL 2024లో వ్యాఖ్యాతలు వీళ్లే.. తెలుగులో ఎవరెవరంటే..

ముంబై 20 మార్చి : టాటా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 కోసం జియో సినిమా త‌న ప్యానెల్ ఎక్స్‌ప‌ర్ట్ బృందం(వ్యాఖ్యాతలు)లోని పేర్లను విడుద‌ల చేసింది. దేశీయ అతిపెద్ద క్రీడా పండుగైన ఐపీఎల్ సంద‌ర్భంగా త‌మ వీక్షకుల‌కు మ‌రింత మ‌ధుర‌మైన అనుభూతి క‌లిగించేందుకు జియో సినిమా ఇంగ్లీష్‌తో స‌హా మొత్తం 12 భార‌తీయ భాషాల్లో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను ఉచితంగా అందిస్తోంది. ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, మ‌రాఠి, గుజ‌రాతి, భోజ్‌పూరి, పంజాబి, బెంగాలి, త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్నడ‌, హ‌ర్యాని భాషాల్లో దిగ్గజ క్రికెట‌ర్ల కామెంట్రీతో మ్యాచ్‌ల‌ను ప్రసారం చేయ‌నుంది. తొలిసారిగా జియో సినిమా హ‌ర్యానిలో ప్రసారాలను ప్రారంభిస్తుండ‌డం విశేషం.

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విధ్వంస‌క‌ర ఓపెనర్‌గా పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగ్‌ను ఇప్పటివరకు చూడ‌ని స‌రికొత్త అవ‌తారంలో అభిమానులు చూడ‌బోతున్నారు. జియో సినిమాలో కొత్తగా ప‌రిచ‌యం చేస్తున్న హ‌ర్యాని భాషాలో సెహ్వాగ్ వ్యాఖ్యానం చేయ‌నున్నాడు. తెలుగులో హనుమ విహారి, వెంకటపతి రాజు, అక్షత్ రెడ్డి, ఆశిష్ రెడ్డి, సందీప్ బవనక, కళ్యాణ్ కొల్లారపు, ఆర్జే హేమంత్, ప్రత్యూష, ఆర్జే కౌశిక్, సునీత ఆనంద్ వ్యాఖ్యానం చేయనున్నారు. అలానే గుజ‌రాతి ప్యానెల్ ఎక్స్‌ప‌ర్ట్ బృందంలో అజేయ్ జ‌డేజా అరంగేట్రం చేయ‌బోతున్నాడు. ఈ భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్‌, ఎంఐ ఎమిరేట్స్ బ్యాటింగ్ కోచ్.. గుజ‌రాతితో పాటు హిందీ, ఇత‌ర భాషల కామెంట్రీ బృందంలో కూడా సంద‌డి చేయ‌నున్నాడు.

ఈ మ‌ధ్య కాలం వ‌ర‌కు వివిధ ఐపీఎల్ జ‌ట్లకు ప్రాతినిధ్యం వ‌హిస్తూ ఆ టీమ్‌ల‌ డ్రెసింగ్ రూమ్‌ల్లో మెలిగిన ఆస్ట్రేలియా ప్లేయ‌ర్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ క్రికెట‌ర్‌ షేన్ వాట్సన్‌, న్యూజిలాండ్ మాజీ కోచ్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగుళూరు డైరెక్టర్ మైక్ హెస్సన్, సెహ్వాగ్‌, జ‌డేజా క్రికెట్ ముచ్చట్లతో అభిమానుల‌ను అల‌రించ‌నున్నారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, కింగ్స్ లెవ‌న్ పంజాబ్ త‌ర‌ఫున ఆడిన త‌ర్వాత సెహ్వాగ్ పంజాబ్ ఫ్రాంచైజీకి మెంట‌ర్ రోల్‌లో సేవ‌లందించ‌డం తెలిసిందే. ఈసారి అభిమానులు అత‌ణ్ణి హ‌ర్యాని వ్యా్ఖ్యాతగా చూడ‌బోతున్నారు. 2012 ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న మ‌న్వీంద‌ర్ బిస్లా కూడా సెహ్వాగ్‌తో క‌లిసి హ‌ర్యాని ఎక్స్‌ప‌ర్ట్ ప్యానెల్‌లో క‌నువిందు చేయ‌నున్నాడు.

రాజ‌స్థాన్ రాయల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున టైటిళ్లు సాధించిన అనంత‌రం జియో సినిమాతో షేన్ వాట్సన్ త‌న అద్భుత‌మైన‌ ప్రయాణాన్ని కొన‌సాగిస్తున్నాడు. 2008 తొలి ఐపీఎల్ సీజ‌న్‌లో వాట్సన్ ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును సొంతం చేసుకోవ‌డం తెలిసిందే. క్రికెట్‌లోని అత్యంత నైపుణ్య, మేధావుల్లో ఒక‌రైన‌ మైక్ హెస్సన్ ఈ టాటా ఐపీఎల్‌లో ప్యానెల్ ఎక్స్‌ప‌ర్ట్‌గా జియో సినిమాతో త‌న ప్రయాణాన్ని కొన‌సాగించ‌నున్నాడు. కింగ్ లెవ‌న్ పంజాబ్ కోచ్‌గా, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగుళూరు డైరెక్టర్‌గా క్రిస్ గేల్‌, ఏబీ డివిల్లీర్స్ స‌హా ఎంద‌రో ఐకానిక్ ప్లేయ‌ర్లకు మైక్ కోచింగ్ ఇచ్చాడు. నిరుడు ఐపీఎల్‌లో త‌మ క్రికెట్ ప‌రిజ్ఞానం, చ‌తుర‌త‌తో అభిమానులు, ప్రేక్షకుల హృదాయాల‌ను దోచుకున్నామ‌ని, ఈసారి దీనిని రెట్టింపు చేసేందుకు మ‌రికొన్ని ప్రయోగాలతో మ‌రింత స‌రికొత్తగా టాటా ఐపీఎల్ 2024లో అభిమానుల‌ను అల‌రించేందుకు తాము సిద్ధమ‌వుతున్నామ‌ని వ‌యాకామ్ 18 స్పోర్ట్స్ హెడ్ ఆఫ్ కంటెంట్ సిద్ధార్థ్ శ‌ర్మ చెప్పారు. ఐపీఎల్‌కు అభిమానుల‌ను మ‌రింత ద‌గ్గర చేసేందుకు దిగ్గజ క్రికెట‌ర్లతో హీరో క్యామ్‌, వైర‌ల్ వీకెండ్స్ వంటి కార్యక్రమాలతో ఉర్రూత‌లూగించ‌నున్నామ‌ని తెలిపారు.


గ‌త ఏడాది అందించిన ఇన్‌సైడ‌ర్స్‌, హ్యాంగ‌వుట్ ఫీడ్స్‌తో పాటు ఈసారి జియో హీరో క్యామ్‌, వైర‌ల్ వీకెండ్‌ను ప్రవేశ‌పెడుతున్నారు. ఈ సీజ‌న్ నుంచి జియో సినిమా వివిధ భాషల‌కు చెందిన 100 మంది మంది సోష‌ల్ కంటెంట్ క్రియేట‌ర్లతో ప్రతి వారం ప్రత్యేక చర్చలు, సంభాష‌ణ‌ల‌తో ఈ ఐపీఎల్‌ను మ‌రింత రంజుగా మార్చనుంది. జియో సినిమా ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో హీరో క్యామ్ అనే అధునాత కెమెరా యాంగిల్‌ను ప్రవేశ‌పెడుతోంది. కేవ‌లం లైవ్ మ్యాచ్‌నే కాకుండా మ్యాచ్ జ‌రుగుతున్నంత సేపు త‌మ అభిమాన క్రికెట‌ర్లను ఎలాంటి అంత‌రాయం లేకుండా అత్యంత దగ్గరగా వీక్షించే అనుభూతి క‌ల్పించేలా జియో సినిమా ప్రసారాలను అందించ‌నుంది. గ‌తం కంటే ఎక్కువ కెమెరా యాంగిల్స్‌ను ప్రేక్షకుల ముందుంచ‌నుంది. జియో సినిమాస్ ఇన్‌సైడ‌ర్ పీడ్‌తో డ్రెసింగ్ రూమ్ సంభాష‌ణ‌లు, గ‌తంలో ఎన్నడూ తెలియ‌ని కొత్త కొత్త క‌థ‌లు, విశేషాల‌ను అభిమానుల ముందుంచి, ఈ ఐపీఎల్‌ను మ‌రింత వినోద‌భ‌రితంగా మార్చనుంది. అలానే దిగ్గజ ప్యానెల్ ఎక్స్‌ప‌ర్ట్స్ విశ్లేష‌ణ‌ల‌తో ప్లేయ‌ర్ దృకోణాన్ని ఆవిష్కరించి, మ్యాచ్‌ల‌పై జియో సినిమా మ‌రింత‌ ఆస‌క్తి పెంచనుంది.

హ్యాంగ‌వుట్ ఫీడ్‌తో ఈ ఐపీఎల్‌లో అభిమానుల‌కు జియో సినిమా మ‌రింత మ‌జా పంచ‌నుంది. ప్రముఖ కంటెంట్ క్రియేట‌ర్స్‌, పాపుల‌ర్ స్టాండ‌ప్ కామిక్స్ అంగ‌ద్ సింగ్‌, విపుల్ గోయెల్‌, ఆదిత్య కుల్‌శ్రేష్ఠ్‌, శ‌శి వంటి వారు జియో సినిమాలో సంద‌డి చేయ‌నున్నారు. నాన్ స్పోర్ట్స్ ఆడియెన్స్‌ను కూడా ఐపీఎల్‌కు చేరువ చేసేందుకు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఐపీఎల్‌ను నిరంత‌రాయంగా ఆస్వాదించ‌డానికి జియో సినిమా (ఐఓఎస్, ఆండ్రాయిడ్) యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మ‌రిన్ని తాజా విశేషాలు, వార్తలు, స్కోర్లు, వీడియోలు కోసం ఫ్యాన్స్ స్పోర్ట్స్ 18 ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్, యూట్యూబ్ పేజీల‌ను, జియో సినిమా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్, యూట్యూబ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

ప్యానెల్ ఎక్స్‌ప‌ర్ట్ వివ‌రాలు(వ్యాఖ్యతలు)

ఇంగ్లిష్‌: క్రిస్ గేల్‌, ఏబీ డివిల్లీర్స్‌, షేన్ వాట్సన్, ఇయాన్ మోర్గాన్‌, బ్రెట్‌లీ, మైక్ హెస్స‌న్‌, అనిల్ కుంబ్లే, రాబిన్ ఊత‌ప్ప‌, గ్రేమ్ స్మిత్‌, స్కాట్ స్ట‌యిరిస్‌, సంజ‌న గ‌ణేశ‌న్‌, సుహైల్‌

హిందీ: జ‌హీర్ ఖాన్‌, సురేష్ రైనా, పార్థివ్ ప‌టేల్‌, ఆర్పీ సింగ్‌, ప్ర‌జ్ఞాన్ ఓజా, ఆకాశ్ చోప్రా, నిఖిల్ చోప్రా, స‌బా క‌రీమ్‌, అనంత్ త్యాగి, రిధిమ

మ‌రాఠి: కేదార్ జాద‌వ్‌, ధ‌వ‌ల్ కుల్‌క‌ర్ణి, కిర‌ణ్ మోరె, సిద్ధేష్ లాడ్‌, ప్ర‌స‌న్న సంత్‌, చైతన్య సంత్‌, కునాల్‌

గుజ‌రాతి: అజేయ్ జ‌డేజా, మ‌న్‌ప్రీత్ జునేజా, రాకేష్ ప‌టేల్‌, భార్గ‌వ్ భ‌ట్‌, షెల్డ‌న్ జాక్స‌న్‌, అతుల్‌, ఆర్జే అసీమ్‌

భోజ్‌పురి: మ‌హ్మ‌ద్ సైఫ్‌, శివ‌మ్ సింగ్‌, స‌త్య‌ప్ర‌కాశ్‌, గులామ్ హుస్సేన్‌, సౌర‌భ్ కుమార్‌, విశాల్ ఆదిత్య సింగ్‌, శాలిని సింగ్‌, సుమిత్ కుమార్‌, అశుతోష్ అమ‌న్‌, రవి కిషన్.

బెంగాలి: జుల‌న్ గోస్వామి, సుభోమోయ్ దాస్‌, శ్రీవాత్స్ గోస్వామి, అనుస్దుప్ మ‌జుందార్‌, సంజీబ్ ముఖ‌ర్జీ, స‌ర‌దిందు ముఖ‌ర్జీ, అనింద్యా సేన్‌గుప్తా, దేబి సాహా

హర్యాన్వీ: వీరేంద్ర సెహ్వాగ్, మన్విందర్ బిస్లా, సోను శర్మ, ఆర్జే కిస్నా, రవిన్ కుందు, ప్రీతి దహయా

మలయాళం: సచిన్ బేబీ, రోహన్ ప్రేమ్, రైఫీ గోమెజ్, సోనీ చెరువత్తూర్, మను కృష్ణన్, జగదీష్, నిదీష్, అజు జాన్ థామస్, రేణు జోసెఫ్, బినోయ్

కన్నడ: అరవింద్, అమిత్ వర్మ, వేద కృష్ణమూర్తి, హెచ్ఎస్‌ శరత్, భరత్ చిప్లి, సుజయ్ శాస్త్రి, రాఘవేంద్ర రాజ్, సుమంత్ భట్, రీనా డిసౌజా, కె శ్రీనివాస్ మూర్తి, వి కౌశిక్, అంకిత అమర్

తమిళం: అభినవ్ ముకుంద్, ఆర్ శ్రీధర్, సుధీర్ శ్రీనివాసన్, భగవతి ప్రసాద్, విద్యుత్ శివరామకృష్ణన్, బాబా అప్రజిత్, బాబా ఇంద్రజిత్, అనిరుధ్‌ శ్రీకాంత్, కెబి అరుణ్ కార్తీక్, సమీనా అన్వర్, అశ్వత్ బోబో

తెలుగు: హనుమ విహారి, వెంకటపతి రాజు, అక్షత్ రెడ్డి, ఆశిష్ రెడ్డి, సందీప్ బవనక, కళ్యాణ్ కొల్లారపు, ఆర్జే హేమంత్, ప్రత్యూష, ఆర్జే కౌశిక్, సునీత ఆనంద్

పంజాబీ: శరణ్‌దీప్ సింగ్, రాహుల్ శర్మ, వీఆర్‌వీ సింగ్, రీతీందర్ సింగ్ సోధి, చేతన్ శర్మ, సునీల్ తనేజా, గుర్జిత్ సింగ్, బల్‌రాజ్ సియాల్

హ్యాంగ‌వుట్‌: విపుల్ గోయల్, అంగద్ సింగ్, ఆదిత్య కులశ్రేష్ఠ, ఇందర్ సహాని, ఆశిష్ సోలంకి, శశి ధీమాన్, కునాల్ సలూజా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 02:40 PM