Share News

IPL 2024: శుభ్‌మన్ గిల్‌కు షాక్.. ఆ తప్పు కారణంగా..

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:15 PM

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఐపీఎల్ నిర్వహకులు షాకిచ్చారు. అసలే చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన బాధలో గిల్‌ ఉన్నాడు. ఇలాంటి సమయంలో గిల్‌కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు.

IPL 2024: శుభ్‌మన్ గిల్‌కు షాక్.. ఆ తప్పు కారణంగా..

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు( Gujarat Titans skipper Shubman Gill) ఐపీఎల్ నిర్వహకులు షాకిచ్చారు. అసలే చెన్నైసూపర్ కింగ్స్‌తో(Chennai Super Kings) జరిగిన మ్యాచ్‌లో ఓడిన బాధలో గిల్‌ ఉన్నాడు. ఇలాంటి సమయంలో గిల్‌కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా గిల్‌కు ఈ జరిమానా విధించినట్టు ఐపీఎల్ నిర్వహకులు తెలిపారు. దీంతో ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానాను ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ‘‘ఐపీఎల్ 2024లో మంగళవారం చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సరైన ఓవర్‌రేట్ మెయింటేన్ చేయలేదు. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ చేసిన మొదటి తప్పిదం కావడంతో ఐపీఎల్ నియామవళి ప్రకారం కెప్టెన్‌ గిల్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నాం.’’ అని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ 63 రన్స్‌తో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. శివమ్‌ దూబే (23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51), రచిన్‌ రవీంద్ర (20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) మెరుపు ఆటతీరును ప్రదర్శించారు. కెప్టెన్‌ రుతురాజ్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) ఆకట్టుకున్నాడు. రషీద్‌ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసింది. సాయి సుదర్శన్‌ (37), మిల్లర్‌ (21), సాహా (21) ఫర్వాలేదనిపించారు. తుషార్‌ దేశ్‌పాండే, దీపక్‌ చాహర్‌, ముస్తాఫిజుర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా దూబే నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SRH vs MI: ముంబై దిగ్గజ బౌలర్ రికార్డుపై భువనేశ్వర్ కన్ను.. మరొక వికెట్ తీస్తే..


SRH vs MI: మన హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ

Updated Date - Mar 27 , 2024 | 05:15 PM