IPL 2025 Mega Auction: ఆ కుర్రాడ్ని వదలని ప్రీతి జింటా.. కోట్లు పోసి మరీ కొనుక్కుంది
ABN , Publish Date - Nov 25 , 2024 | 08:25 PM
IPL 2025 Mega Auction: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఆడుతున్న ఆట మామూలుగా లేదు.
Priyansh Arya: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఆడుతున్న ఆట మామూలుగా లేదు. తమకు కావాల్సిన క్రికెటర్ల కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా టీమ్స్ వెనుకాడటం లేదు. పర్స్‌లో అందుబాటులో ఉన్న మొత్తాన్ని బట్టి ప్లేయర్ల కోసం ఆఖరి వరకు పోటీపడుతున్నాయి. దీంతో కొందరు టాలెంటెడ్ యంగ్ ప్లేయర్ల పంట పండింది. అందులో ఒకడే ప్రియాన్ష్ ఆర్య. ఈ ఢిల్లీ కుర్రాడు జాక్‌పాట్ కొట్టేశాడు. అతడ్ని భారీ ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
మామూలోడు కాదు
ప్రియాన్ష్ ఆర్యను రూ.3.80 కోట్లు పెట్టి మరీ టీమ్‌లోకి తీసుకుంది ప్రీతి జింటా. అతడే కావాలని పట్టుబట్టి మరీ వేలంలో కొనుక్కుంది. అయితే ప్రియాన్ష్ గురించి అంతగా ఎవరికీ తెలియదు. డొమెస్టిక్ క్రికెట్‌లో పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. దీంతో ఓ కుర్ర క్రికెటర్ కోసం ప్రీతి జింటా ఎందుకింతగా ఫైట్ చేశారు? అతడి కోసం కోట్లు ఎందుకు కుమ్మరించారు? అని చాలా మంది ఆలోచనల్లో పడ్డారు. అయితే ప్రియాన్ష్ ఆర్య మామూలోడేం కాదు. 23 ఏళ్ల ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మంచి ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఆ విధ్వంసం చూసే టీమ్‌లోకి..
ఈ ఏడాది ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ప్రియాన్ష్ ఆర్య అదరగొట్టాడు. ఓ మ్యాచ్‌లోనైతే ఒకే ఓవర్‌లో ఏకంగా 6 బంతులకు 6 సిక్సులు బాదాడు. ఇతర మ్యాచుల్లోనూ భారీ షాట్లతో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫియర్‌లెస్ అప్రోచ్, లెఫ్టాండ్ బ్యాటర్ కావడం, పరుగులు చేయాలనే తపన ఉండటం, భారీ షాట్లతో రిజల్ట్‌ను ఛేంజ్ చేసే సత్తా ఉండటంతో ఈ దేశవాళీ ఆటగాడి కోసం ప్రీతి జింటా కోట్లు కుమ్మరించారని అనలిస్టులు అంటున్నారు. అతడి టాలెంట్ ముందే గుర్తించి, పక్కా తీసుకోవాలని భావించి ఆక్షన్‌లోకి రాగానే భారీగా బిడ్ చేసి సొంతం చేసుకున్నారని చెబుతున్నారు.
Also Read:
కుమ్మక్కైన ఆర్సీబీ-ముంబై.. ఎంతకు తెగించార్రా..
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒక్క గెలుపుతో 5 రికార్డులు బ్రేక్
పేరుకు తోపులు.. ఒక్కరూ అమ్ముడుపోలేదు
For More Sports And Telugu News