IPL 2025 Mega Auction: కుమ్మక్కైన ఆర్సీబీ-ముంబై.. ఎంతకు తెగించార్రా..
ABN , Publish Date - Nov 25 , 2024 | 07:21 PM
IPL 2025 Mega Auction: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు ఆడుతున్న గేమ్ మామూలుగా లేదు.
జెడ్డా: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు ఆడుతున్న గేమ్ మామూలుగా లేదు. జట్టులో కచ్చితంగా ఉండాల్సిందేనన్న ఆటగాడి కోసం భారీ బిడ్డింగ్‌కు వెళ్తున్న టీమ్స్.. అక్కర్లేదు అనుకున్న ప్లేయర్ల కోసం ఇతర జట్లను టీజ్ చేసి వదిలేస్తున్నాయి. అయితే పాపులర్ ఫ్రాంచైజీలైన ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించాయి. ఆ రెండు టీమ్స్ కుమ్మక్కు అవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్సీబీ-ఎంఐ మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
ఒక్క షేక్ హ్యాండ్‌తో..
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ విల్ జాక్స్ కోసం ఈసారి వేలంలో తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఎట్టకేలకు రూ.5.25 కోట్ల ధర చెల్లించి అతడ్ని సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్. ఇతర టీమ్స్ పోటీపడినా జాక్స్ కోసం చివరి వరకు గట్టిగా ఫైట్ చేసి దక్కించుకుంది ఎంఐ. రెండో రోజు ఆక్షన్‌లోకి వచ్చాడు కాబట్టి జాక్స్‌కు ఈ రేట్ వచ్చింది. అదే నిన్న అయితే టీమ్స్ పర్స్ భారీగా ఉంది కాబట్టి బిగ్ ప్రైజ్ దక్కించుకునేవాడేమో. అయితే జాక్స్ విషయంలో ఆర్సీబీ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఆ ఫ్రాంచైజీ ముంబైతో కుమ్మక్కు అయిందని.. అందుకే అంత తక్కువ ధరకు అతడ్ని వదిలేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆకాశ్ అంబానీ వెళ్లి ఆర్సీబీ సీఈవోకు షేక్ హ్యాండ్ ఇవ్వడం దీనికి మరింత ఊతం ఇస్తోంది.
అంతా లోలోపలే..
విల్ జాక్స్‌కు సంబంధించిన బిడ్డింగ్ ముగిశాక అతడి కోసం ఆర్టీఎం వాడతారా అంటూ ఆర్సీబీ ఓనర్స్‌ను ఆక్షనీర్ అడిగారు. అయితే తాము ఉపయోగించడం లేదంటూ బెంగళూరు యాజమాన్యం చెప్పడంతో అతడ్ని దక్కించుకున్న ముంబై ఓనర్స్ సంతోషంలో మునిగిపోయారు. అయితే బడా హిట్టర్ అయిన జాక్స్‌ను తిరిగి బెంగళూరులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ నుంచి చాన్నాళ్లుగా డిమాండ్లు వినిపించాయి. దానికి తోడు 6 కోట్ల లోపు ధరకే పోతుండటంతో అతడి కోసం ఆర్టీఎం కార్డును వాడతారని అంతా అనుకున్నారు. కానీ ఆర్సీబీ అతడ్ని వదిలేసింది. అతడ్ని తీసుకోబోమంటూ అనంత్ అంబానీకి ఆర్సీబీ సీఈవో సైగలు చేశారు. దీంతో అనంత్ వచ్చి ఆయన్ను హగ్ చేసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పారు. ఇది చూసిన నెటిజన్స్.. ఆర్సీబీ-ముంబై కుమ్మక్కు అయ్యాయని అంటున్నారు. టిమ్ డేవిడ్‌ను బెంగళూరుకు ఇచ్చేసి.. జాక్స్‌ను ముంబై తీసేసుకుందని, ఇది పెద్ద ప్లానింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది పక్కా స్కెచ్ అని.. అంతా లోలోపల మాట్లాడుకొని జరిగిపోయిందన్నారు.
Also Read:
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒక్క గెలుపుతో 5 రికార్డులు బ్రేక్
పేరుకు తోపులు.. ఒక్కరూ అమ్ముడుపోలేదు
చిత్తుగా ఓడినా ఆసీస్ పొగరు తగ్గలేదు.. వీళ్లకు రోహితే కరెక్ట్ మొగుడు
For More Sports And Telugu News